జెన్ జెడ్ న‌టిపై ద‌ర్శ‌కురాలి అప‌రిమిత ప్రేమ‌!

తారా సుతారియాతో క‌లిసి ప‌ని చేసిన క్ర‌మంలో గీతూ మోహ‌న్ దాస్ త‌న‌కు బాగా క‌నెక్ట‌యిపోయార‌ని ఆమె మాట‌లు చెబుతున్నాయి. ``తారాను రక్షించడానికి నాకు ఎప్పుడూ సహజమైన ప్రేమ అనిపించింది.;

Update: 2026-01-03 15:16 GMT

క‌థానాయిక‌ల‌తో ద‌ర్శ‌కుల‌ సాన్నిహిత్యం చాలా స‌హ‌జ‌సిద్ధ‌మైన‌ది. త‌న సినిమా కాస్టింగ్ తో ప్రేమ‌లో ప‌డ‌టం నేచుర‌ల్. కానీ ఇక్క‌డ సీనియ‌ర్ హీరోయిన్‌ల‌ను మించి న‌వ‌త‌రం క‌థానాయిక‌ను అభిమానిస్తున్న మ‌హిళా ద‌ర్శ‌కురాలు క‌వితాత్మ‌క ప్ర‌శంస‌ల‌తో ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. నేటి జెన్ జెడ్ న‌టి అద్భుత న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌కు ముగ్దురాలైపోవ‌డంతో త‌న‌ను పొగ‌డ‌టానికి అస్స‌లు వెన‌కాడ‌టం లేదు. త‌న‌ను ఈ రంగంలో కాపాడాల‌ని, అంత మంచి ఆత్మ అని, త‌నను చాలా ఆశ్చ‌ర్య‌పరిచింద‌ని ప్రేమ‌ను కురిపించారు. అంతేకాదు ఈ ద‌ర్శ‌కురాలి ప‌నిత‌నాన్ని స‌ద‌రు జెన్ జెడ్ న‌టీమ‌ణి కూడా అంతే ఇదిగా పొగిడేస్తున్నారు. ఈ సంభాష‌ణ అంతా ఎవ‌రి గురించి? అంటే... టాక్సిక్ న‌టి తారా సుతారియా- ద‌ర్శ‌కురాలు గీతు మోహ‌న్ దాస్ మ‌ధ్య ప్రేమానుబంధం గురించే ఇదంతా.

 

యష్ నటించిన `టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్` మార్చిలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో న‌టించిన తార‌ల ఫస్ట్ లుక్ పోస్టర్‌లను ఇప్ప‌టికే షేర్ చేయ‌గా అవి ఫ్యాన్స్ ను ఆక‌ట్టుకున్నాయి. క‌థానాయిక‌లు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి పాత్రల పోస్టర్‌లను ఇప్ప‌టికే ఆవిష్కరించారు. ఆ ముగ్గురి లుక్‌లు ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఇప్పుడు మేకర్స్ తారా సుతారియా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. తారాను రెబెక్కాగా పరిచయం చేశారు. వెంటనే చిత్ర దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తారాను ప్రశంసిస్తూ ఒక నోట్‌ను షేర్ చేసారు.

తారా సుతారియాతో క‌లిసి ప‌ని చేసిన క్ర‌మంలో గీతూ మోహ‌న్ దాస్ త‌న‌కు బాగా క‌నెక్ట‌యిపోయార‌ని ఆమె మాట‌లు చెబుతున్నాయి. ``తారాను రక్షించడానికి నాకు ఎప్పుడూ సహజమైన ప్రేమ అనిపించింది. బహుశా త‌ను ఒక ప్రొటెక్టివ్ సోల్ కాబట్టి.. అది ఆమెకు సౌకర్యంగా ఉండే కవచం కావచ్చు. బహుశా దానిని నిర్వచించాల్సిన అవసరం లేదు`` అని ఎమోష‌న‌ల్ గా వ్యాఖ్యానించారు గీతూ. టాక్సిక్ లో తారా పాత్ర‌ను చాలా సింపుల్ గా ఉంచాల‌ని తాను న‌మ్మిన‌ట్టు తెలిపారు. త‌ను ఏదో చేసేయాల‌ని, త‌న నుంచి చాలా ఎక్కువ తీసుకోవాల‌ని నేను అనుకోలేదు. ఆ ఎంపిక మా మ‌ధ్య‌ సమీకరణాన్ని రూపొందించింది. ప్రశాంతంగా, ప్రొఫెషనల్‌గా మా మ‌ధ్య సింక్ కుదిరింద‌ని గీతూ తెలిపారు. తారా సెట్లో ఉన్న‌ప్పుడు మాట్లాడే కంటే గ‌మ‌నించ‌డానికి ఇష్ట‌ప‌డింది. గ‌మ‌నించ‌డం విన‌డాన్ని ఇష్ట‌ప‌డుతుంది. అంతేకాదు తారా సుతారియా న‌ట‌న‌లోకి దిగిన‌ప్పుడు త‌న‌ను బాగా స‌ర్ ప్రైజ్ చేసింద‌ని కూడా గీతూ మోహ‌న్ దాస్ తెలిపారు. తారా ఉన్న చోట శ‌క్తివంత‌మైన‌ది ఏదో పుట్టింది. త‌న‌లో అంత‌ర్గ‌త అవ‌గాహ‌న నుంచి చాలా సృజ‌నాత్మ‌క‌త పుట్టింది. త‌ను నన్ను పూర్తిగా ఆశ్చర్యపరిచింది.. చాలా అందంగా..తారా థియేట‌ర్ల‌లో మిగతా వారందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుందని నాకు ఎటువంటి సందేహం లేదు`` అని తెలిపారు.

దీనికి తారా సుతారియా కూడా ప్ర‌తిస్పందించారు. నా ప్రియ‌మైన గీతూ నిన్ను అంద‌రూ ఆరాధిస్తారు. ఒక క్రియేట‌ర్ గా ఆలోచ‌నాత్మ‌కంగా బుద్ధి కుశ‌ల‌త ఉన్న కెప్టెన్ గా గొప్ప శ‌క్తి, సున్నిత‌త్వంతో దీనిని న‌డిపించినందుకు ధ‌న్య‌వాదాలు అని అన్నారు తారా. రెబ‌క్కా పాత్ర‌ను స‌హ‌జ‌సిద్ధ‌మైన ఎన‌ర్జీతో రూపొందంచినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

టాక్సిక్ కి గీతూ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌. దీనిని కన్నడ- ఇంగ్లీష్ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం స‌హా ప‌లు ఇతర భాషలలో డబ్ వెర్షన్‌లను ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా, రవి బస్రూర్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ (జాన్ విక్), జాతీయ అవార్డు గ్రహీత జంట అన్బరివ్- కెచా ఖంఫక్డీతో కలిసి హై-ఆక్టేన్ యాక్షన్‌ను కొరియోగ్రఫీ చేశారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ - మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యష్ నిర్మించారు. మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పద్వా స‌హా సుదీర్ఘ పండుగ వారాంతంలో గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు టాక్సిక్ సిద్ధంగా ఉంది.

Tags:    

Similar News