లిప్‌లాక్‌ పెట్టి మరీ కన్ఫర్మ్‌ చేసింది..!

గాడ్‌ ఫాదర్‌ విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే తెలుగులో మరిన్ని సినిమాలు చేసే అవకాశం దక్కించుకునేది.;

Update: 2025-07-16 06:24 GMT

తమిళ సినిమా ఇండస్ట్రీలో వారసత్వంతో అడుగు పెట్టిన తాన్య రవిచంద్రన్‌ తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు, స్టార్‌డం దక్కించుకుంది. దశాబ్ద కాలం క్రితం కోలీవుడ్‌లో అడుగు పెట్టి ఈ అమ్మడు పలు తమిళ సినిమాల్లో నటించింది. తమిళ్‌తో పాటు అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. 2021లో కార్తికేయ హీరోగా నటించిన తెలుగు మూవీ ' రాజా విక్రమార్క' సినిమాలో నటించడం ద్వారా టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత ఏడాదిలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన 'గాడ్‌ ఫాదర్‌' సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించింది. ఆ సినిమాలో నయనతార చెల్లి పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.


గాడ్‌ ఫాదర్‌ విజయాన్ని సొంతం చేసుకుని ఉంటే తెలుగులో మరిన్ని సినిమాలు చేసే అవకాశం దక్కించుకునేది. కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా గుర్తింపు తెచ్చి పెట్టలేదు. హీరోయిన్‌గా సినిమా ఆఫర్లు వస్తున్న సమయంలో అలా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించడం ఏంటంటూ చాలా మంది ఆమె పై విమర్శలు చేశాడు. తమిళ్‌లో సినిమాలు వస్తున్న సమయంలోనే టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ పాత్రను చేసింది. ఆ సినిమా కాస్త బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడటంతో మళ్లీ తెలుగు సినిమా ఆఫర్లు కనిపించడం లేదు. దాంతో మళ్లీ కోలీవుడ్‌లోనే ఈ అమ్మడు సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి షూటింగ్‌ దశలో ఉండగా, మరోటి చర్చల దశలో ఉన్నాయి.

తెలుగులో మాత్రం ఇప్పటి వరకు మరో సినిమాను దక్కించుకోలేక పోయింది. సినిమాల విషయంలో నిరుత్సాహంగా ఉన్న తాన్య రవిచంద్రన్‌ తాజాగా సోషల్‌ మీడియా ద్వారా షాకింగ్‌ విషయాన్ని కూల్‌గా అనౌన్స్‌ చేసింది. సాధారణంగా హీరోయిన్స్ ప్రేమలో ఉంటే మొదట పుకార్లు వస్తాయి, ఆ తర్వాత వారి గురించి మీడియాలో కథనాలు వస్తాయి, చివరకు వారి నుంచి అధికారిక ప్రకటన వస్తుంది. కానీ తాన్య రవిచంద్రన్‌ మాత్రం వాటన్నింటికి అవకాశం ఇవ్వకుండా తాను ప్రేమలో ఉన్నట్లుగా ముందుగానే చెప్పేసింది. అంతే కాకుండా ఈమె ఒక ఫోటో షేర్‌ చేయడం ద్వారా జనాల్లో మరింతగా ఆసక్తిని రేకెత్తించింది, తాన్య లవ్‌ చేస్తున్న వ్యక్తి గురించి చర్చ జరిగేలా చేసింది.

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తాన్య తాను ప్రేమిస్తున్న వ్యక్తితో లిప్‌ లాక్‌ చేసిన ఫోటోను షేర్‌ చేసింది. దాదాపుగా ఐదున్నర లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న తాన్య రవిచంద్రన్‌ ఏకంగా తన ప్రియుడితో లిప్ లాక్ చేసిన ఫోటోను షేర్‌ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే ఆ ఫోటోలో తాన్య ఫేస్‌లు కనిపించకుండా డార్క్‌ మోడ్‌ లో కేవలం షాడోస్‌ను మాత్రమే కవర్‌ చేసింది. అందులో ఉన్నది తాన్య అని అర్థం అవుతుంది, కానీ అతడు ఎవరు అనే విషయం మాత్రం క్లారిటీ రావడం లేదు. దాంతో అతడి గురించి సోషల్‌ మీడియాతో పాటు అన్ని మీడియాల్లోనూ సెర్చ్‌ మొదలైంది. తాన్య ఎప్పటికి తన ప్రియుడిని అధికారికంగా పరిచయం చేస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలు ఎలాగో తగ్గాయి కనుక ఈ అమ్మడు పెళ్లికి సిద్ధం అయ్యి ఇలాంటి లిప్‌లాక్‌ ఫోటోతో ప్రేమను కన్ఫర్మ్‌ చేసిందా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. తాన్య నుంచి తదుపరి ప్రకటన కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News