స్టన్నింగ్ లుక్ లో వీరమల్లు విలన్ భార్య.. హీరోయిన్స్ కూడా దిగదుడుపే!

ఈమధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అప్పుడప్పుడు సెలబ్రిటీలే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు.;

Update: 2025-08-07 00:30 GMT

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత అప్పుడప్పుడు సెలబ్రిటీలే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నారు. ముఖ్యంగా హీరోల భార్యలే కాదు సినిమాల ద్వారా విలన్ గా పాపులారిటీ సంపాదించుకున్న వారి భార్యలు కూడా అందరినీ ఆకట్టుకుంటున్నారు. వీరిని చూసాక అరె.. ఈ విలన్ భార్య ఇంత అందంగా ఉందా? అని నెటిజన్స్ కూడా నోరెళ్లబెడుతున్నారు. అలా అందం విషయంలో హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు వారిలో తాజాగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా విలన్ బాబీ డియోల్ భార్య కూడా ఒకరు. అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చే ఈమె.. ఇప్పుడు సడన్గా ఒక బర్తడే పార్టీలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. ఆమె అందం చూసి సెలబ్రిటీలే కాదు నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ముంబైలో జరిగిన అర్పితా ఖాన్ పుట్టినరోజు వేడుకలకు చాలామంది సినీ తారలు హాజరయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కూడా తన భార్య తాన్యా డియోల్ తో కలసి హాజరయ్యారు. ఇక్కడ ఈమె లుక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది తాన్యా. ప్రస్తుతం తాన్యా వయసు 49 సంవత్సరాలు.. అయినా కూడా ఈమె ఇంకా టీనేజ్ గర్ల్ లా ఉంది అని అభిమానులు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే తాన్యా ఈ వేడుకకు పాస్టెల్ టై అండ్ డై.. పింక్, నారింజ, నీలం, పసుపు, ఊదా ఇలా అన్ని రంగుల కలయికలో ఈ డ్రెస్ ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ లో సాయంత్రం వేడుకకు ఈమె హాజరు కావడంతో లైట్స్ వెలుగుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇకపోతే తాన్య, బాబి డియోల్ ఇద్దరు చాలా సింపుల్ లుక్ లో కనిపించినా.. బర్తడే ఈవెంట్ లో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తానికి అయితే తాన్య అందానికి ముగ్ధులైన నెటిజన్స్ ఆమె ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారని చెప్పవచ్చు.

బాబీ డియోల్ విషయానికి వస్తే.. ఈయన ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర చిన్న కుమారుడు. 1977లో వచ్చిన ధరమ్ వీర్ అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత 1995లో వచ్చిన బర్సాత్ సినిమాతో హీరోగా మారారు. ఈ చిత్రంలో అద్భుతమైన నటన కనబరచడంతో ఉత్తమ నూతన నటుడి విభాగంలో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఈమధ్య టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ ఇటు సౌత్ ఆడియన్స్ ని కూడా మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తమిళ్ కంగువ చిత్రంతో తొలిసారి సౌత్ ఆడియన్స్ ను పలకరించిన బాబీ డియోల్.. తెలుగులో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ద్వారా తెలుగు ఆడియన్స్ ను మెప్పించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలో ఔరంగజేబు పాత్ర పోషించి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు.

Tags:    

Similar News