'లిటిల్ హార్ట్స్' మౌళి కామెంట్స్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ బన్నీ వాస్!
90స్ బయోపిక్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు తనూజ్ మౌళి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.;
90స్ బయోపిక్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న యువ నటుడు తనూజ్ మౌళి ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మౌళి పేరే వినిపిస్తోంది. అయితే రీసెంట్ గా మేకర్స్ ఏర్పాటు చేసిన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో మౌళి చేసిన పనికి నిర్మాత బన్నీ వాస్ ఉలిక్కిపడి మళ్లీ మామూలు మోడ్ లోకి వచ్చారు. అసలేం జరిగిందంటే?
సక్సెస్ మీట్ లో మూవీ టీమ్ కు ముందు థ్యాంక్స్ చెప్పిన మౌళి.. ఆ తర్వాత ఆడియన్స్ గురించి మాట్లాడాంటూ పిచ్చోళ్లా మీరు అంటూ స్టార్ట్ చేశాడు. దీంతో వెనుక ఉన్న బన్నీ వాస్.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమైనా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తారోమోనని భయపడినట్లు కనిపించారు. కానీ ఆ తర్వాత ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా.. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని అని మౌళి అన్నాడు.
దీంతో వెంటనే ఊపిరి పీల్చుకుని బన్నీ వాస్.. ఫుల్ గా నవ్వేశారు. పక్కనే ఉన్న శివాని కూడా అలానే ఫీల్ అయ్యారు. అయితే ఆ తర్వాత మంచి సినిమా తీశామని తెలుసని, ఫస్ట్ వీక్ లో కొందరు వస్తారని, ఆ నెక్స్ట్ వారం సినిమా బాగా ఆడుతుందని అనుకున్నామని తెలిపాడు మౌళి. అలాగే అంతా ప్రిపేర్ అయ్యామని చెప్పాడు.
మంచి సినిమాకు సపోర్ట్ చేస్తారని మరోసారి రుజువైందని, రెండు వారాలు మాత్రమే చిత్రం ఉంటుందేమో అనుకున్నామని తెలిపారు. ప్రేక్షకులు థియేటర్ కు వస్తారో, లేదో అని చాలా భయపడ్డామని చెప్పారు. మొదటిరోజే రూ.2 కోట్లకు పైగా వసూలు చేసిందని, అది సినిమా బడ్జెట్ కంటే ఎక్కువని చెప్పారు. పిచ్చోళ్లయ్యాం మేమంతా అని అన్నారు.
సాయి మార్తాండ్ మంచి సినిమా తీశారని, కొన్ని వారాల పాటు సినిమా ఆడుతుందని తెలిపారు. ఈ వారంలో ఎన్నిసార్లు ఎమోషనల్ అయ్యానో తనకే తెలియదని అన్నారు. ఎంత ప్రేమ చూపించారోనని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా సినిమా బాలేదంటే చాలు.. నెటిజన్లే వాళ్లను గట్టిగా ఏసుకుంటున్నారని గుర్తు చేశారు.
ఇండస్ట్రీలో చాలామంది సినిమా సపోర్ట్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారని, ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. బండ్ల గణేశ్ అన్నకు, రవితేజ గారు, నాని గారు అందరికీ థాంక్స్ అని చెప్పారు. తాను ఈ వారమంతా గాల్లో తేలుతూనే ఉన్నానని, కిందకు దిగనని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇంకా కష్టపడతానని అందరికీ మాట కూడా ఇచ్చారు.