స్టార్ హీరోని టార్గెట్ చేసిన తమిళ మీడియా?
ఆ స్టార్ హీరో గే అని అతడికి మగాళ్లతో సన్నిహితంగా ఉండే అలవాటు ఉందని సదరు గాయని ఆరోపించింది. అతడికి వివాహేతర సంబంధాలున్నాయని మరోసారి తీవ్రంగా ఆరోపించింది.
సుచీలీక్స్ లో ప్రముఖ తమిళ స్టార్ హీరోపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. అతడికి వివాహేతర సంబంధాలున్నాయని, రాత్రి పూట మేల్ స్టార్స్ తో పార్టీలు చేసుకుంటాడని, తన భర్త కం గే అయిన వాడితో కూడా అతడు అత్యంత సన్నిహితంగా ఉన్నాడని సింగర్ సుచిత్ర గతంలో ఆరోపించారు. అయితే ఆమెకు మతి చెడిందని, మానసికంగా కుంగిపోవడం వల్ల అలా మాట్లాడుతోందని తనపై ఒక ముద్ర వేసారు.
అయితే ఆ ఎపిసోడ్ అప్పట్లో ముగిసిపోయింది అనుకుంటుండగానే, ఇప్పుడు ఇంత గ్యాప్ వచ్చాక కూడా సుచిత్ర మళ్లీ మీడియా ఇంటర్వ్యూలో ఘాటైన కామెంట్లు చేయడంతో ఇది మరోసారి చర్చనీయాంశమైంది. ఆ స్టార్ హీరో గే అని అతడికి మగాళ్లతో సన్నిహితంగా ఉండే అలవాటు ఉందని సదరు గాయని ఆరోపించింది. అతడికి వివాహేతర సంబంధాలున్నాయని మరోసారి తీవ్రంగా ఆరోపించింది. అందువల్లనే అతడి భార్యతో సరిపడలేదని, ఆ ఇద్దరూ ఒకరినొకరు ఛీట్ చేసుకున్నారని కూడా ఆరోపించారు సుచిత్ర.
అదంతా అటుంచితే, భార్యతో బ్రేకప్ విషయంలో సదరు స్టార్ హీరో తప్పు ఉందంటూ తమిళ మీడియా చానెళ్లు ఎటాక్ చేసాయి. సింగర్ సుచిత్ర ఇంటర్వ్యూకి కావాల్సినంత ఫోకస్ నిచ్చాయి. దీంతో అతడి సినిమా రిలీజవుతోంది అనగానే ఇలా తమిళ మీడియాలు ఎటాక్ చేస్తుంటాయని ఇటువైపు నుంచి కౌంటర్ ఎటాక్ ప్రారంభమైంది. ఇకపోతే సుచిత్ర కామెంట్లపై సదరు స్టార్ హీరో అభిమానులు చెలరేగి కౌంటర్లు వేస్తున్నారు కానీ అతడు మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక యుద్ధమే జరుగుతోందని చెప్పాలి.