• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమిళ దర్శకుల డిమాండ్.....

తమిళ దర్శకుల డిమాండ్.. పక్కింట్లో కూడా..

| ఇక ఈమధ్య తమిళ దర్శకులు అయితే ఎక్కువగా పక్క ఇండస్ట్రీలపై ఎక్కువగా ఫోకస్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2024-03-13 07:05 GMT

పక్కింటి పుల్ల కూర రుచి.. అనే సామెత గురించి అందరికి తెలిసిందే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నటీనటులు టెక్నీషియన్స్ అందరూ కూడా అదే రుచిలో మునిగి తేలుతున్నారు. ఒక విధంగా ఇది మంచిదే అని చెప్పవచ్చు. టాలెంట్ అనేది బౌండరీలు దాటితేనే మరింత కొత్తగా ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈమధ్య తమిళ దర్శకులు అయితే ఎక్కువగా పక్క ఇండస్ట్రీలపై ఎక్కువగా ఫోకస్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. కమర్షియల్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలతో సక్సెస్ లు అందుకుంటున్న ఈ దర్శకులతో ఇతర భాషలలో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తమ సినిమాలతో అన్ని భాషలలో ప్రేక్షకులని మెప్పిస్తొన్న ఈ స్టార్ డైరెక్టర్స్ కి డైరీ నెక్స్ట్ రెండు, మూడేళ్ళకి ఫుల్ బిజీగా ఉండబోతోంది.

వీరిలో ముందుగా వినిపించే పేరు అట్లీ. గత ఏడాది హిందీలో షారుఖ్ ఖాన్ తో జవాన్ మూవీ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. మేగ్జిమమ్ ఈ ఏడాదిలోనే ఈ మూవీపై అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావొచ్చు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ హిట్ అయితే మిగిలిన టాలీవుడ్ స్టార్స్ కూడా అతనితో సినిమాలు చేయడానికి రెడీ అయ్యే ఛాన్స్ ఉంది.

కమర్షియల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ మురుగదాస్ తమిళంలో సూపర్ హిట్స్ అందుకున్నాడు. తెలుగులో స్టాలిన్, స్పైడర్ సినిమాలు చేసిన డిజాస్టర్ అయ్యాయి. ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్ తో మూవీ ఖరారు చేసుకున్నాడు. మురుగదాస్ శివకార్తికేయన్ తో మూవీ చేస్తున్నాడు. దాని తర్వాత సల్మాన్ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ స్టార్ డైరెక్టర్ విష్ణువర్ధన్ సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇతను తెలుగులో పంజా మూవీ పవన్ కళ్యాణ్ తో చేసి డిజాస్టర్ అందుకున్నాడు.

కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న లోకేష్ కనగరాజ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా చర్చల దశలో ఉంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఈ మూవీ చేయనున్నట్లు టాక్. రియలిస్టిక్ కథలతో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్ జూనియర్ ఎన్టీఆర్ తో ఒక మూవీ చేయనున్నట్లు గతంలోనే చెప్పాడు.

ఈ ప్రాజెక్ట్ చర్చల దశలోనే ఇంకా ఉంది. గత ఏడాది జైలర్ తో సూపర్ హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ అల్లు అర్జున్ తో సినిమా కోసం మంచి కథ రెడీ చేసుకుంటున్నాడు. డైరెక్టర్ వెంకట్ ప్రభు గత ఏడాది నాగ చైతన్యతో కస్టడీ అనే మూవీ చేశాడు. ఇది డిజాస్టర్ అయ్యింది. లింగుస్వామితో రామ్ పోతినేనితో ది వారియర్ మూవీ చేశాడు. ఇది ఫ్లాప్ అయ్యింది. కెఎస్ రవికుమార్ బాలయ్యతో రెండు సినిమాలు చేసిన ఒకటి సక్సెస్ కాలేదు. సముద్రఖని తెలుగులో శంభో శివ శంభో, బ్రో సినిమాలు చేశాడు. రెండు ఏవరేజ్ టాక్ తెచ్చుకున్నాయి.

Tags:    
  • Kollywood 
  • Stardirectors 
  • Directors 
  • Lokesh 
  • Nelson 
  • Atlee 
  • Armurugadoss 
  • Shankar 
  • Bollywood 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

Copyright @2026

Powered by Blink CMS