తమన్నా లక్‌... రెండు దశాబ్దాలైనా రచ్చే

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది.;

Update: 2025-04-26 21:30 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతుంది. 2005 సంవత్సరంలో హిందీ మూవీ చాంద్ సా రోషన్ చెహ్రా, తెలుగు సినిమా 'శ్రీ' తో సినీ కెరీర్‌ను ప్రారంభించింది. మొదటి ఏడాదిలో లక్‌ కలిసి రాలేదు. సినిమాలు పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. ఆ తర్వాత ఏడాది కూడా కలిసి రాలేదు. 2007లో నటించిన హ్యాపీ డేస్ సినిమా తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నాకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. తెలుగులో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. టాలీవుడ్‌ స్టార్‌ హీరోల అందరితోనూ సినిమాలు చేసిన ఘనత ఈ అమ్మడికి దక్కింది. యంగ్‌ స్టార్‌ హీరోలతోనే కాకుండా చిరంజీవి, వెంకటేష్‌ వంటి సీనియర్ స్టార్స్‌తోనూ ఈ అమ్మడు నటించింది.

సాధారణంగా హీరోయిన్స్ దశాబ్ద కాలం పాటు బిజీగా కొనసాగితే గొప్ప విషయం. కానీ ఈ అమ్మడు రెండు దశాబ్దాలు అయినా కెరీర్ ఏ మాత్రం జోరు తగ్గలేదు. టాలీవుడ్‌లో ఈ అమ్మడి జోరు తగ్గింది. కానీ నార్త్‌ ఇండియాలో ఈమె జోరు కంటిన్యూ అవుతోంది. సినిమాలనే కాకుండా వెబ్‌ సిరీస్‌లు, మ్యూజిక్ వీడియోలు, ఐటెం సాంగ్స్ ఇలా చాలా విధాలుగా ప్రేక్షకులకు చేరువ అవుతూ వస్తోంది. మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాలీవుడ్‌లో ఏకంగా అయిదు సినిమాలు చేస్తోంది. అందులో రెండు పెద్ద సినిమాలు కావడం విశేషం. బాలీవుడ్‌ యంగ్‌ స్టార్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్ర హీరోగా నటిస్తున్న వ్యన్ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.

దీపక్ మిశ్రా దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న 'వ్యన్‌' సినిమాపై తమన్నా చాలా ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఈ అమ్మడి సినిమాలు బాలీవుడ్‌లో చాలా విడుదల అయ్యాయి. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్‌లు దక్కించుకోలేదు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో సక్సెస్‌ను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ అమ్మడు రైడ్‌ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తానికి రెండు దశాబ్దాలు అయినా కూడా కెరీర్‌లో ఏమాత్రం తగ్గకుండా ఓ రేంజ్‌లో దూసుకు పోతున్న మిల్కీ బ్యూటీ ఎంతో మందికి ఆదర్శం.

ఒక్క భాషపై నమ్మకం పెట్టుకోకుండా, ఒకే ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉండకుండా అన్ని భాషల్లో సినిమాలు చేయడం ద్వారా ఒకచోట కాకున్నా మరో చోట అయినా ఆఫర్లు ఎప్పుడూ ఉంటాయి అనేది తమన్నాను చూస్తే అర్థం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల వారు కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ తమన్నాకు ఉన్న క్రేజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ క్రేజ్‌కు తగ్గట్లుగానే మిల్కీ బ్యూటీ తమన్నా రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఆ అందమైన ఫోటోల కారణంగా కూడా తమన్నాకు బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వస్తూ ఉంటాయి. మరో దశాబ్ద కాలం పాటు మిల్కీ బ్యూటీ తమన్నా బిజీ బిజీగా సినిమాలు చేసే అవకాశం ఉంది. అదృష్టం అంటే తమన్నాదే అంటూ ఆమె ఫ్యాన్స్ కామెంట్‌ చేస్తూ ఉంటారు.

Tags:    

Similar News