పిక్‌టాక్ : మిల్కీ బ్యూటీ అందం తగ్గదా..?

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటింది. అయినా కూడా జోరు తగ్గడం లేదు.;

Update: 2025-05-06 12:05 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటింది. అయినా కూడా జోరు తగ్గడం లేదు. ఇప్పటి వరకు మిల్కీ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో బిజీ బిజీగానే ఉంది. కొన్నాళ్ల క్రితం మిల్కీ బ్యూటీ తమన్నా పనై పోయింది అంటూ కొందరు కామెంట్ చేశారు. ఆ సమయంలోనే తమన్నా సినిమాలకు గుడ్ బై చెబుతుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆమె పట్టుదలతో సినిమాల్లో కొనసాగింది. ఆ సమయంలో కాస్త ఆఫర్లు తగ్గినా కూడా వెబ్‌ సిరీస్‌లు, ఐటెం సాంగ్స్‌తో కెరీర్‌ను నిలబెట్టుకుంది. ఇప్పుడు మరోసారి మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్‌ పీక్స్‌లో ఉంది. హిందీ, తెలుగు భాషల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా వరుస సినిమాలు చేస్తోంది.

ఇటీవల ఈమె ఓదెల 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలో లేడీ అఘోరి పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. శివశక్తి పాత్రతో ఓదెల సినిమాలో అద్భుతమైన నటన కనబర్చిన తమన్నా మరోసారి తన నట విశ్వరూపం చూపించింది. తెలుగులో చాలా రోజుల తర్వాత తమన్నా చేసిన ఓదెల 2 నిరాశ పరచింది. అయినా కూడా ఆమె మరిన్ని సినిమాల్లో నటించేందుకు ఆ సినిమా బూస్ట్‌ గా నిలిచింది అనడంలో సందేహం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా ఇప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. సోషల్‌ మీడియాలోనూ ఆమె ఫాలోయింగ్‌ అదే స్థాయిలో ఉంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నాకి దాదాపుగా మూడు కోట్ల మంది ఫాలోవర్స్ ఉంటారు. వారిని ఎంటర్‌టైన్‌ చేసేందుకు గాను అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్‌గా రెచ్చి పోతూనే ఉంటుంది. తాజాగా మరోసారి మిల్కీ బ్యూటీ రెడ్‌ డ్రెస్‌లో తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. సాధారణంగా హీరోయిన్స్ రెడ్‌ డ్రెస్‌లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. తమన్నా ఈ పోటోల్లో మరింత అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా షేర్‌ చేసిన ఈ ఫోటోలు ఆమె పై అభిమానంను మరింత పెంచే విధంగా ఉన్నాయని, ఈమె ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు అయిందంటే నమ్మశక్యంగా లేదని కొందరు అంటున్నారు.

ఈ ఏడాది ఇప్పటికే ఓదెల 2, రైడ్‌ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేవలం హీరోయిన్‌గానే నటిస్తాను అనే పట్టింపు లేకుండా వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ను ఈ అమ్మడు స్వాదీనం చేసుకుంటూ దూసుకు పోతుంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈమె సొంతం. ఈమె ఇటీవల ప్రేమలో విఫలం అయిందనే విషయం తెల్సిందే. ఆ మధ్య ఈమె పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చాయి. ఇటీవల ప్రేమ విఫలం కావడంతో పెళ్లి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నటిగా తమన్నా మరింత బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News