• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పింక్ లెహంగాలో తమన్నా...

పింక్ లెహంగాలో తమన్నా గ్లామర్ మంత్రం

| పింక్ చీర, బ్లౌజ్ లో తమన్నా ఆకర్షణీయమైన సొగసుతో యువతరాన్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.

By - Tupaki Desk
Update: 2024-10-28 07:37 GMT

పింక్ కలర్ లెహంగాలో తమన్నా గ్లామర్ ఫుల్ లుక్ లో కనువిందు చేసింది. ప్రముఖ డిజైనర్లు అబూ జానీ-సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఈ కాస్ట్యూమ్ లో ఆమె మరింత మెరుస్తోంది. దీపావళి కానుకగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పిక్స్ షేర్ చేసిన తమన్నా, అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన 'ఫుల్‌ఝాది' అని క్యాప్షన్ తో పేర్కొంది. పింక్ చీర, బ్లౌజ్ లో తమన్నా ఆకర్షణీయమైన సొగసుతో యువతరాన్ని మంత్ర ముగ్ధుల్ని చేసింది.


తమన్నా కెరీర్ విషయానికొస్తే, ఆమె తన సినీ ప్రస్థానాన్ని 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే బాలీవుడ్ చిత్రంతో ప్రారంభించింది. తెలుగులో ‘శ్రీ’ చిత్రంతో ఆమె టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కానీ ఆమెకు పెద్ద గుర్తింపు వచ్చిన చిత్రం ‘హ్యాపీ డేస్’. అప్పటి నుంచి తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘100% లవ్’, ‘బాహుబలి’, ‘ఎఫ్2’, ‘సైరా’ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువైంది.


తాజాగా ఈ ఫోటో షూట్ లో తమన్నా తన అప్‌డేట్‌లను అభిమానులతో పంచుకుంటూ, తన డిజైనర్ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణను ప్రదర్శిస్తోంది. ఈ ఫోటోలలో ఆమె తన అందాన్ని మాత్రమే కాకుండా, తనలోని నమ్మకాన్ని కూడా ప్రతిబింబిస్తోంది. సాంప్రదాయ, ఆధునికత మేళవింపుతో అభిమానుల మనసులు దోచుకుంటున్న ఈ లుక్ లో తమన్నా డీప్ పింక్ డ్రెస్సులో యాక్సెసరీస్ తో కలిసి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తోంది.


ప్రస్తుతం తమన్నా పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది. వెబ్ సిరీస్, పాన్ ఇండియా సినిమాల తో పాటు ఆమెకు బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా లభించాయి. ఇటీవల తమన్నా స్పెషల్ సాంగ్స్ తో కూడా ఆకట్టుకుంటోంది. స్త్రీ 2లో కూడా ఒక సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓదెలా 2 సినిమాలో అఘోరా పాత్రలో నటిస్తోంది. ఇక ఆమెలేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు లైక్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    
  • TamannaahBhatia 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actresstamannaahbhatia 
  • Phototalk 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS