18 ఏళ్ల కెరియర్ సక్సెస్ కి కారణం సినిమాలు కాదు.. తమన్నా కామెంట్స్ వైరల్!
ఇకపోతే 18 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటికీ ఇంత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడానికి కారణం సినిమాలు కాదు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.;
ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. శ్రీ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 'హ్యాపీడేస్' సినిమాతో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత రచ్చ, బద్రీనాథ్, తడాఖా, సైరా నరసింహారెడ్డి, ఊసరవెల్లి ఇలా ఎన్నో చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఉండే అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె. బాలీవుడ్ లోనే కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇకపోతే ఈ మధ్య ఈమె నటించిన సినిమాలు పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇకపోతే 18 ఏళ్ల సినీ కెరియర్ లో ఇప్పటికీ ఇంత స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడానికి కారణం సినిమాలు కాదు అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇన్నేళ్ల తన సినీ కెరియర్ సక్సెస్ కి కారణం సినిమాలు కాదు స్పెషల్ సాంగ్స్ అంటూ చెప్పి అబ్బురపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే... ఒకవైపు సినిమాలు , వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న అవకాశం వస్తే స్పెషల్ సాంగ్స్ లలో కూడా చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోని ఇటీవల ఈమె చేసిన ఒక స్పెషల్ సాంగ్ భారీగా సక్సెస్ అవ్వడంతో తమన్నా పేరు మరోసారి గట్టిగా వినిపిస్తోందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తమన్నా మాట్లాడుతూ.. "నేను ఇప్పటికే ఎన్నో తెలుగు, తమిళ్, హిందీ సినిమాలలో నటించాను. అయితే ఆ చిత్రలేవీ కూడా నాకు మంచి గుర్తింపుని అందివ్వలేదు. కానీ ఎప్పుడైతే తెలుగులో అల్లు అర్జున్ తో బద్రీనాథ్ సినిమా చేశానో.. ఆ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ కి భారీ గుర్తింపు వచ్చింది. అప్పటినుంచి చాలామంది దర్శక నిర్మాతలు నన్ను స్పెషల్ సాంగ్ల కోసమే నన్ను సంప్రదించేవారు. అలా అప్పటినుంచి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ అలాగే ఇతర సౌత్ చిత్రాలలో కూడా నేను స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాను. ఒకరకంగా చెప్పాలి అంటే ఇన్నేళ్ల కెరియర్లో నాకు మంచి సక్సెస్ ఇచ్చింది మాత్రం స్పెషల్ సాంగ్స్ వల్లే.. సినిమాల వల్ల కాదు అంటూ అసలు నిజం బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది తమన్నా. అంతేకాదు సినిమాల కంటే కూడా తనకు ఎక్కువ క్రేజ్ వచ్చిన స్పెషల్ సాంగ్స్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నాను అంటూ కూడా తెలిపింది.
తమన్నా సినిమాల విషయానికొస్తే.. చివరిగా ఓదెలా 2 సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు . అటు తమిళంలో అరుణ్మనై 4లో కూడా నటించింది. ఇప్పుడు బాలీవుడ్ లో రోమియో, రేంజర్, వివన్ తో పాటు మొత్తం నాలుగు చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈ చిత్రాలన్నీ ఈమెకు ఎలాంటి గుర్తింపును అందిస్తాయో చూడాలి.