కళాత్మక డిజైన్.. టబు న్యూలుక్ ఇంట్రెస్టింగ్
మరోవైపు టబు సోషల్ మీడియాల్లోను ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ముఖ్యంగా పరిశ్రమలో ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకునే టబు ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లోను కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు ఆసక్తిని కనబరుస్తోంది.;
టాలీవుడ్ లో అగ్ర హీరోలందరి సరసనా నటించింది టబు. బాలీవుడ్ లోను సుదీర్ఘ కాలం నటనలో కెరీర్ జర్నీ సాగించింది. దాదాపు రెండు దశాబ్ధాల క్రితం `చాందిని బార్` చిత్రంలో వేశ్య పాత్రలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. టబు భారతీయ సినిమాల్లో ఏజ్ లెస్ బ్యూటీగా అలరిస్తోంది. అటు హిందీ పరిశ్రమ సహా ఇటు దక్షిణాదినా మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా తెలుగులో తనవైపు వచ్చే ముఖ్యమైన పాత్రలను ఎప్పుడూ కాదనుకుండా నటిస్తోంది.
ఇక టబు ఫ్యాషన్ సెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వయసుతో సంబంధం లేకుండా ఇటీవల `క్రూ` చిత్రంలో కృతి సనోన్, కరీనాలతో పోటీపడుతూ గ్లామరస్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. హాలీవుడ్ చిత్రం డ్యూన్ ప్రొఫెసీలో చక్రవర్తి మాజీ ప్రేయసిగా అద్భుత నటనతో ఆకట్టుకుంది. తదుపరి సీక్వెల్ చిత్రం `డ్యూన్ ప్రాఫెసీ పార్ట్ 2`లోను నటిస్తోంది. భూత్ బంగ్లా సహా విజయ్ సేతుపతి సరసనా ఓ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.
మరోవైపు టబు సోషల్ మీడియాల్లోను ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. ముఖ్యంగా పరిశ్రమలో ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకునే టబు ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ లోను కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు ఆసక్తిని కనబరుస్తోంది. తాజాగా సందీప్ కోస్లా అబుజానీ డిజైన్ లుక్ లో మెరుపులు మెరిపించింది. లెజెండరీ ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన డిజైనర్ దుస్తుల్లో షోస్టాపర్‌గా నిలిచింది. అబు సందీప్ జోడీ ఐకానిక్ ఆర్కిటెక్చరల్ కోట్ లో టబు అత్యంత ఆకర్షణీయంగా కనిపించింది.
25 సంవత్సరాలుగా డిజైనర్ ద్వయంతో కలిసి పనిచేస్తున్న టబు ప్రతి సందర్భంలోను వారు తనను ఫ్యాషన్ ప్రపంచంలో రాణిగా నిలబెట్టారని ప్రశంసలు కురిపించారు. నేను ప్రతిసారీ నా అత్యంత ప్రత్యేక సందర్భాలలో అబు జాని సందీప్ ఖోస్లా దుస్తులను ధరిస్తానని టబు వెల్లడించింది. వీళ్లు నా స్నేహితులు అని పిలవడానికి చాలా సంతోషిస్తాను.. వారు స్త్రీని అందంగా మలచడంలో నిష్ణాతులు. ఇది సాంప్రదాయ విధానంలో చేతితో రూపొందించిన డిజైన్... ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అనుకోలేదు. ఇలాంటిది మునుపెన్నడూ చూడలేదని టబు కితాబిచ్చారు.
టబు 90లలో తన నటనా రంగ ప్రవేశం చేసారు. అయితే తాను సినిమాల్లో అడుగుపెడతానని ఏనాడూ ఊహించలేదని టబు చెప్పారు. కానీ ఈ రంగంలోకి వచ్చినందుకు ఆనందంగా ఉన్నానని పేర్కొంది. బాలనటిగా దేవానంద్ `హమ్ నౌజావాన్` (1985)లో మొదటిసారి టబు నటించింది. ఈ చిత్రంలో దేవానంద్ కి కుమార్తెగా నటించింది. ఆ తర్వాత కథానాయికగా రిషి కపూర్ సరసన `పెహ్లా పెహ్లా ప్యార్` (1994)లో అవకాశం అందుకుంది. అమెరికన్ సినిమా రోమన్ హాలిడే ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇక హెచ్.బి.వి ప్రీక్వెల్ సిరీస్ డ్యూన్ ప్రాఫసీలోను టబు నటించింది. చక్రవర్తి జావికో కొరినో (మార్క్ స్ట్రాంగ్) మాజీ ప్రేమికురాలు .. కాన్ స్టంటైన్ (జోష్ హ్యూస్టన్) తల్లిగా నటించింది. డ్యూన్: ప్రాఫసీ రెండవ సీజన్ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది.