• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుట్టంలా సూసి పోకలా.....

సుట్టంలా సూసి పోకలా.. విశ్వక్ కిర్రాక్ కెమిస్ట్రీ!

| ఈ లిరికల్ సాంగ్ వీడియోలో విశ్వక్ సేన్ నేహా శెట్టి సింపుల్ స్టెప్స్ తోనే మంచి హైప్ అయితే ఇస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2023-08-16 10:46 GMT

టాలీవుడ్ మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటూ వస్తున్న విశ్వక్ సేన్ తన ప్రతి సినిమాతో కూడా ఏదో ఒక డిఫరెంట్ కథను అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ఇక ఈసారి అతను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరింత కొత్తగా ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాడు.


టాలెంటెడ్ దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అయితే సినిమాకు సంబంధించిన మొదటి లిరికల్ సాంగ్ కూడా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పుడు విడుదల చేశారు. 'సుట్టంలా సూసి పోకల' అనే ఆ పాట మంచి మెలోడీ బీట్ తో ఆకట్టుకునే విధంగా ఉంది.

యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక చాలా రోజుల తర్వాత యువన్ తనధైన శైలిలో ఒక మంచి ట్యూన్ అయితే ఇచ్చాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఎలాంటి పాటనైనా సరే ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా పాడగల సింగర్ అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు. ఇక ట్యూన్ కు తగ్గట్టుగా శ్రీహర్ష ఇచ్చిన లిరిక్స్ కూడా గుండెను తాకే విధంగా ఉన్నాయి.

ఇక ఈ పాట మెలోడీ బీట్ కు తగ్గట్టుగా హీరో హీరోయిన్ ఇద్దరు కూడా కెమిస్ట్రీతో అదరగొట్టేసారు. ఈ లిరికల్ సాంగ్ వీడియోలో విశ్వక్ సేన్ నేహా శెట్టి సింపుల్ స్టెప్స్ తోనే మంచి హైప్ అయితే ఇస్తున్నారు. నేహా శెట్టి ఇటీవల కాలంలో ఎలాంటి పాట చేసిన కూడా తన అందంతో పాటు చిరునవ్వుతో కూడా మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక ఇప్పుడు విశ్వక్ తో ఆమె కెమిస్ట్రీ మరింతగా హైలెట్ అయింది.

చూస్తూ ఉంటే సాంగ్ సినిమాపై మరింత అంచనాలను పెంచే విధంగా రెస్పాన్స్ అందుకుంటుంది అని చెప్పవచ్చు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో డిఫరెంట్ డ్రామాగా తెరపైకి రాబోతోంది. చాలా తక్కువ స్థాయిలో ఉండే కథానాయకుడు ఊహించని స్థాయిలో బడా బాబులను ఎదిరించి ఎలా ఉన్నత స్థాయికి ఎదిగాడు అనే పాయింట్ తో ఈ సినిమాను రుపొంధిస్తున్నట్లు సమాచారం. ముందుగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తోనే చిత్ర యూనిట్ మంచి హైప్ పెంచారు. దానికి తోడు పోస్టర్స్ అలాగే విశ్వక్ న్యూ లుక్ ఇంకా టీజర్ కూడా సినిమాపై మరింత పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేస్తోంది. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 8వ తేదీన విడుదల కాబోతోంది.

Full View
Tags:    
  • Tollywood 
  • Krishnachaitanya 
  • Vishwaksen 
  • Nehashetty 
  • Gangsofgodavari 
  • Suttamlasoosi 
  • Lyricalsong 
  • Yuvanshankar 
  • Sitaraentertinments 
  • Anuragkulkarni 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS