సుస్మితాసేన్ జీవితంలో మెడిక‌ల్ మిరాకిల్!

తాజాగా ఆ ప‌రిస్థితి ఎలా దాటిందో సుస్మితాసేన్ క్లియ‌ర్ గా వివ‌రించింది.;

Update: 2025-07-02 10:57 GMT

మాజీ మిస్ యూనివ‌ర్శ్ సుస్మితా సేన్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. న‌టిగా..ఐటం భామ‌గా ఓ వెలుగు వెలిగిన సుస్మిత కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అప్పుడ‌ప్పుడు వ్య‌క్తిగ‌త విష‌యాలతోనూ మీడియాలో వైర‌ల్ అవుతుంది. కొన్ని సంవ‌త్స‌రాల క్రితం సుస్మితా సేన్ కూడా అనారోగ్యం బారిన ప‌డి కోలుకుంది. ఆరోగ్య ప‌రంగానూ కొన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కుంది.

తాజాగా ఆ ప‌రిస్థితి ఎలా దాటిందో సుస్మితాసేన్ క్లియ‌ర్ గా వివ‌రించింది. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే సుస్మితా అనారోగ్యం బారిన ప‌డింది. 2014 నుంచో అటో ఇమ్యూన్ డిజార్డ్ అయి అడిస‌న్స్ డిసీజ్ బారిన ప‌డిందిట‌. సుస్మిత శ‌రీరంలోనే కార్డిసోల్ అనే హార్మోన్ ఉంద‌ని తేలిందిట‌. ఇది ప్రాణంత‌క‌మైంది కావ‌డంతో ఎనిమిది గంట‌ల‌కు ఒక‌సారి హైడ్రా కార్డిసోన్ అనే స్టెరాయిడ్ ని ఇంజెక్ట్ చేసుకోవాల‌ని వైద్యులు చెప్పారుట‌.

వ్యాయామాలు, బ‌రువులు ఎత్త‌డం చేయ‌కూడ‌ద‌ని సూచించారుట‌. కానీ సుస్మిత‌న ఫిట్ నెస్ కోచ్ ఆధ్వ ర్యంలో జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ మొద‌లు పెట్టిందిట‌. యాంటీ గ్రావిటీ వ్యాయామాల‌తో పాటు డిటాక్సిఫికేష‌న్ ప్రారంభిచిందిట‌. దీంతో ఒక రోజు తీవ్ర అస్వ‌స్త‌త‌కు గురైందిట‌. అప్పుడు దుబాయ్ నుంచి అబుదాబీ తీసుకెళ్లి చికిత్స చేయించారుట‌. ఆ త‌ర్వాత ట‌ర్కీ వైద్యులు పోన్ చేసి సుస్మిత జీవితంలో మిరాకిల్ జ‌రిగింద‌ని చెప్పారుట‌.

త‌న అడ్రిన‌ల్ గ్రంధి ఇప్పుడు స‌వ్యంగా ప‌నిచేస్తుంద‌ని.. ఇక‌పై స్టెరాయిడ్లు వేసుకోవాల్సిన ప‌నిలేదని చెప్పారట‌. సుస్మిత కెరీర్ లో ఇలా జ‌ర‌గ‌డంతో త‌న‌తో పాటు కుటుంబం ఎంతో షాక్ అయిందిట‌. జీవి తాంతం స్టెరాయిడ్లు వేసుకోవాల్సి వ‌స్తోంద‌ని కుటుంబం ఎంతో క్షోభ‌కు గుర‌వుతున్న స‌మ‌యంలో ఈ విష‌యం తెలియ‌డంతో ఎంతో బారం దించుకున్న‌ట్లు అయింద‌ని సుస్మిత తెలిపింది.

Tags:    

Similar News