చంద్రహాస్ పై కేసు.. నెక్స్ట్ ఏం జరుగుతుందో?

బుల్లితెర స్టార్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా ప్రమోషన్స్‌ లో భాగంగా పాడిన పాట ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే.;

Update: 2026-02-05 05:23 GMT

బుల్లితెర స్టార్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తన లేటెస్ట్ మూవీ బరాబర్ ప్రేమిస్తా ప్రమోషన్స్‌ లో భాగంగా పాడిన పాట ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పోలీస్ కేసు నమోదైంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో గుంజి.. గుంజి అంటూ సాగే పాటను చంద్రహాస్ పాడాడు. ఆ సాంగ్ లో అసభ్యకర పదాలు ఉండడం.. సోషల్ మీడియాతోపాటు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

సాంగ్ లో వినియోగించిన పదాలు, బూతులపై గత రెండు మూడ్రోజులుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు రెస్పాండ్ అయ్యి.. తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. నెటిజన్లు అయితే ఓ రేంజ్ లో చంద్రహాస్ ను ట్రోల్ చేస్తున్నారు. అసలు అలాంటి సాంగ్ పాడడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఇచ్చిన యూటిట్యూడ్ ట్యాగ్ సరిగ్గా సరిపోతుందని పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

అదే సమయంలో సీనియర్ జర్నలిస్టు అశోక్ వేములపల్లి సాంగ్ పై రెస్పాండ్ అవుతూ.. పదజాలాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఒక నటుడిగా సమాజానికి ఇచ్చే సందేశం ఇదేనా అంటూ క్వశ్చన్ చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే దానిపై రెస్పాండ్ అయిన చంద్రహాస్ తన వీడియో మెసేజ్ ద్వారా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే రివర్స్ ఎటాక్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు.

సాంగ్ పై తాను క్షమాపణ చెప్పలేదనే విమర్శలు వస్తున్నప్పటికీ, తనపై గతంలో తీవ్ర విమర్శలు, బూతులు వచ్చాయని తెలిపారు. కానీ వాటిని క్రిటిసిజంలా తీసుకున్నానని చెప్పాడు. అయితే పాటలో వినిపించిన బూతులు ఒరిజినల్ సాంగ్‌ లో లేవని, ఇంపాక్ట్ కోసం తానే సృష్టించానని వెల్లడించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ప్రేక్షకుల నుంచి చప్పట్లు వచ్చాయని కూడా చెప్పుకొచ్చాడు.

అప్పుడే సీనియర్ జర్నలిస్టు అశోక్ వేములపల్లి కామెంట్స్ పై రెస్పాండ్ అయ్యి.. వీడియోలో తన ఫ్యామిలీని ప్రస్తావించారని ఆరోపిస్తూ 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. ఒకవేళ సారీ చెప్పకపోతే మాత్రం తాను ఇప్పటికే లాయర్లతో మాట్లాడుతున్నానంటూ హెచ్చరించాడు. దీంతో అశోక్ వేములపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌ లో చంద్రహాస్ పై కేసు నమోదైంది

అశోక్ వేములపల్లి ఫిర్యాదు మేరకు చంద్రహాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఆ విషయంపై స్పందిస్తున్న నెటిజన్లు.. ప్రమోషన్స్ విభిన్నంగా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ, ఇలా అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. అయితే ఇప్పటికే ట్రోల్స్ ఎదుర్కొంటున్న చంద్రహాస్ కు తాజా కేసు మరిన్ని ఇబ్బందులు తెచ్చి పెట్టేలా ఉంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News