'ధురంధ‌ర్ 2' లో ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌లు!

ఫ‌స్ట్ పార్ట్ సంచ‌ల‌నం సృష్టించ‌డంతో అంద‌రి దృష్టి ఇప్పుడు పార్ట్ 2పై ప‌డింది. పార్ట్ 2ని 'ధురంధ‌ర్ 2: ది రివేంజ్‌' పేరుతో అత్యంత భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.;

Update: 2026-02-05 05:37 GMT

'ధురంధ‌ర్‌'..దేశవ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న పేరిది. అంతే కాకుండా దేశ ద్రోహుల గుండెల్లోనూ ఫిరంగులు పేలుస్తున్న పేరు కూడా ఇదే. సినిమాలో మాధ‌వ‌న్ 'హిందూస్థానియోంకే స‌బ్‌సే బ‌డా దుష్మ‌న్ హిందూస్థానిహిహే.. పాకిస్థాన్ తో దూస్రా నంబ‌ర్ ప‌ర్ ఆతాహే' ( భార‌తీయుల అతి పెద్ద శ‌త్రువు భాయ‌తీయుడే..పాకిస్థాన్ ఆ త‌రువాత నంబ‌ర్‌లో ఉంటుంది). ఈ డైలాగ్‌కు త‌గ్గ‌ట్టే ఇండియాలో ఉంటూ ఇండియాకు వెన్నుపోటు పొడుస్తున్న ఇంటి దొంగ‌ల‌పై ఎంతో సాహ‌సోపేతంగా చేసిన సినిమా ఇది.

అదే ఈ మూవీని దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉండేలా చేస్తోంది. విమర్శ‌లు, యాంటీ పాకిస్థాన్ నెరేటీవ్ అని అంతా విమ‌ర్శ‌లు చేసినా వాస్త‌వ సంఘ‌ట‌న‌లు, ఇండియాపై ఇంటి దొంగ‌లు చేసిన కుట్ర‌ల‌ని అత్యంత ప్ర‌భావ‌వంతంగా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా 'ధురంధ‌ర్‌'లో చూపించాడు ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్‌. ఫ‌స్ట్ పార్ట్ సంచ‌ల‌నం సృష్టించ‌డంతో అంద‌రి దృష్టి ఇప్పుడు పార్ట్ 2పై ప‌డింది. పార్ట్ 2ని 'ధురంధ‌ర్ 2: ది రివేంజ్‌' పేరుతో అత్యంత భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ డేట్‌ని కూడా ప్ర‌క‌టించిన టీమ్ మార్చి 19న సినిమాని రిలీజ్ చేస్తున్నామ‌ని తెలిపింది.

అదే జోష్‌తో సినిమా టీజ‌ర్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేయ‌డంతో మ‌ళ్లీ సినిమాలో స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ వైఫ్‌, న‌టి యామీ గౌత‌మ్ చేసిన వ్యాఖ్య‌లు 'ధురంధ‌ర్ 2'పై అంచ‌నాల‌ని తారా స్థాయికి చేరుస్తున్నాయి. యామీ గౌత‌మ్ తాజాగా ఓ ఎఫ్ ఎమ్ రేడియో ఛాన‌ల్‌కు ప్ర‌త్యేకంగా ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఈ సంద‌ర్భంగా భ‌ర్త ఆదిత్య ధ‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది. అంతే కాకుండా సీక్వెల్ ఈ సారి మామూలుగా ఉండ‌ద‌ని హింట్ ఇచ్చేసింది.

'నాకైతే త‌నే ధురంధ‌ర్‌. ఈ మూవీని చాలా ద‌గ్గ‌రి నుంచి చూశాను. సీక్వెల్ విష‌యంలో మీకో హింట్ ఇస్తాను. వైఫ్‌గా చాలా గ‌ర్వంగా ఉంది. ఒక ఆర్టిస్ట్‌గా, క్రియేటివ్ ప‌ర్స‌న్‌గా ఇండ‌స్ట్రీలో వ‌ర్క్ చేస్తున్న వ్య‌క్తిగా ఇంత‌కు మించి ఆడియ‌న్స్ ఎలాంటి సినిమా ఇవ్వ‌గ‌లం. ప్రేక్ష‌కులు గ‌ర్వంగా థియేట‌ర్ల‌కు రావాల‌నుకునే సినిమా 'ధురంధ‌ర్'. ఇది 2025కిచ్చిన గిఫ్ట్ కాదు..2026కి ఇచ్చిన వెల్క‌మ్ గిఫ్ట్‌' అన్నారు. అంతే కాకుండా 'ధురంధ‌ర్ 2' ఫ‌స్ట్ పార్ట్‌కు మించి అత్యంత శ‌క్తివంతంగా ఉండ‌బోతోంది' అంటూ అస‌లు బాంబ్‌ పేల్చేసింది.

అమె మాట్లాడిన మాట‌ల‌ని బ‌ట్టి రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజ‌ర్‌ని ఎన‌లైజ్ చేస్తే పార్ట్ 2 నిజంగా ఇండియ‌న్ పాలిటిక్స్‌లో ఓ బ్లోవుట్‌లా మార‌బోతోంద‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. సినిమాలో చాలా వ‌ర‌కు హిడెన్ సీక్రెట్స్‌ని బ‌య‌టికి తీసుకురాబోతున్నార‌ట‌. అంతే కాకుండా ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌లు ఎన్నో ఉంటాయ‌ని, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన అతిథి పాత్ర‌ల్లో చాలా వ‌ర‌కు కీల‌క స్టార్స్ క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. యాక్ష‌న్, వ‌యెలెన్స్ అన్ లిమిటెడ్ గా ఉంటుంద‌ట‌. అంతే కాకుండా దీన్ని అత్యంత భారీ సినిమాటిక్ యూనివ‌ర్స్‌గా ద‌ర్శ‌కుడు ఆదిత్య‌ధ‌ర్ రూపొందించినట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా మునుపెన్న‌డూ చూడ‌ని చీక‌టి సామ్రాజ్యాల‌ని ఈ సినిమాతో బ‌హిర్గ‌తం చేయ‌బోతున్నాడ‌ని చెబుతున్నారు. ఇండియ‌న్ సినీ చ‌రిత్ర‌లోనే ఇదొక అత్యంత ప్ర‌మాద‌క‌ర సినిమాగా ప‌రిణ‌మించ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది. అన్నీ అనుకున్న‌ట్టుగా సినిమాలో ఉంటే మాత్రం 'ధురంధ‌ర్ 2' ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి స‌రికొత్త చ‌రిత్ర లిఖించ‌డం ఖాయం.

Tags:    

Similar News