ధనుష్, మృణాల్.. ఆ హీరో అలా అన్నాడేంటి..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని నెలలుగా రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని నెలలుగా రూమర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో గతంలో జరిగిన రెండు ఈవెంట్స్ లో ఇద్దరు కలిసి కనిపించడంతో.. అప్పటి నుంచి ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ మధ్య ఫిబ్రవరి 14వ తేదీన పెళ్లి కూడా చేసుకున్నారని ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో జరిగింది.
దీంతో కొన్ని రోజుల క్రితం డేటింగ్ రూమర్స్ పై మృణాల్ రెస్పాండ్ అయ్యి.. ధనుష్ తనకు ఓ మంచి ఫ్రెండ్ అంటూ క్లారిటీ ఇచ్చారు. అలా రూమర్స్ కు చెక్ పెట్టారు. ఇక రీసెంట్ గా మృణాల్.. ధనుష్ తనకు ఓ సోదరుడు లాంటి వాడు అన్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. అది ఫ్యాన్ పేజీగా తెలుస్తుండగా.. ఆ విషయం తెగ చక్కర్లు కొట్టింది.
ఆ తర్వాత లవ్ కోసం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మృణాల్.. ప్రేమ ఎంతో అందమైన భావన అని తెలిపారు. ప్రపంచంలో ఉన్న ప్రతీ ఒక్కరికి ప్రేమ కచ్చితంగా పుడుతుందని, అది మనల్ని ఓ మంచి వ్యక్తిగా మారుస్తుందని చెప్పారు. మనలోని పసి ఛాయలను దూరం చేస్తుందని, లవ్ ప్రపంచంలో ఒక అందమైనదిగా వర్ణించారు. ప్రతి ఒక్కరు జీవితంలో ప్రేమను పొందాలని కోరుకుంటున్నానని వెల్లడించారు.
ఆ కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతుండగా.. తాజాగా ఓ బాలీవుడ్ హీరో చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో మృణాల్, బాలీవుడ్ హీరో సిద్ధాంత్ పాల్గొన్నారు. అందులో ఇద్దరి మధ్య ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. అప్పుడే సిద్ధాంత్ ఒక్కసారిగా మృణాల్ ను ఆటపట్టిస్తూ.. ఇన్సే నా వో చెన్నై వాలా (ఆ చెన్నై వ్యక్తి గురించి ఆమెను అడగండి) అని కామెంట్ చేశారు.
దీంతో అంతా నవ్వగా.. మృణాల్ రియాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా బ్లష్ అవుతూ ఆమె నవ్వేసింది. కాస్త సిగ్గు పడినట్టుగా, ఆశ్చర్య పోయినట్టు కనిపించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. సిద్ధాంత్ ధనుష్ కోసమే అన్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే.. చెన్నైకు చెందిన స్టార్ హీరో ధనుష్ అన్న విషయం అందరికీ తెలిసిందే.
మృణాల్ బ్లష్ అయిన విజువల్స్ ను నెటిజన్లు షేర్ చేస్తూ.. ఏదో ఉన్నట్లు అనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. దీంతో మళ్లీ డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. అయితే సిద్ధాంత్ సరదాగా అని ఉంటారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి ఈవెంట్లలో ఒకరినొకరు ఆటపట్టించడం సాధారణమేనని, మృణాల్ కూడా కూల్ గా రెస్పాండ్ అయిందని అంటున్నారు. అయితే ఏదేమైనా ధనుష్- మృణాల్ మధ్య నిజంగా ఏదైనా ఉందా? లేదా? అన్నది వారికే తెలియాలి.