ఒక్క హిట్ సినిమా.. సూర్యను ఇలా డెసిషన్ తీసుకునేలా చేసిందా?
సాధారణంగా స్టార్ హీరోలు కథ, పాత్ర, బడ్జెట్, మార్కెట్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఒక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.
స్టార్ హీరో సూర్య చేసిన తాజా కామెంట్స్ సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఒక డైరెక్టర్‌పై తనకు ఎంతటి నమ్మకం ఏర్పడిందో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లక్కీ భాస్కర్ చూసిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్ వెంకీ అట్లూరితో తప్పకుండా వర్క్ చేయాలనే ఆలోచన తనలో బలపడిందని సూర్య చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రీసెంట్ గా జరిగిన విశ్వనాథ్ & సన్స్ మూవీ ఈవెంట్ లో సూర్య మాట్లాడుతూ, లక్కీ భాస్కర్ సినిమా తర్వాత వెంకీ ఏ స్క్రిప్ట్ తీసుకొచ్చినా ఓకే చెప్పాలని తాను ముందే డిసైడ్ అయ్యానని, వాస్తవానికి వెంకీతో వర్క్ చేయాలని తాను మానిఫెస్ట్ చేస్తున్నానని అన్నారు. వెంకీ గురించి సూర్య చెప్పిన ఈ ఒక్క మాట ఆయనకు ఉన్న పూర్తి నమ్మకాన్ని స్పష్టం చేస్తోంది. సూర్య లాంటి ఓ స్టార్ హీరో కథ వినకముందే ఒక డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలనే స్థాయిలో నమ్మకం ఏర్పడటం అరుదైన విషయమని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
సాధారణంగా స్టార్ హీరోలు కథ, పాత్ర, బడ్జెట్, మార్కెట్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే ఒక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. కానీ వెంకీ ఏ కథ చెప్పినా ఓకే అని సూర్య ముందుగానే అనుకోవడం ఆ డైరెక్టర్ పనితనానికి వచ్చిన పెద్ద ప్రశంసగా భావిస్తున్నారు. లక్కీ భాస్కర్ సినిమా సూర్యపై చూపిన ఇంపాక్ట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఈ మాటల ద్వారా అర్థమవుతోంది.
తర్వాత ప్రొడ్యూసర్ వంశీ కాల్ చేసి వెంకీ డేట్స్ ఉన్నాయి, మనం సినిమా చేద్దాం సర్ అని చెప్పారని, అయితే మొదట్లో వెంకీ తనకు చెప్పింది బయోపిక్ కథని, కానీ ఇప్పుడు చేసింది వేరే సినిమా అని సూర్య క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆ టైమ్ లో వెంకీ, సూర్యకు చెప్పిన బయోపిక్ ఏది? అది ఎందుకు ముందుకు వెళ్లలేదు? అనే ప్రశ్నలు కూడా తెరపైకి వచ్చాయి. కాగా వెంకీ ఇప్పటికే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ పలు బయోపిక్స్ చేసిన సూర్య, ప్రస్తుతం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలనుకుని ఆ బయోపిక్ ను పక్కన పెట్టారని వెంకీ చెప్పిన విషయం తెలిసిందే.
సూర్య మాటలు మరో విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నాయి. సక్సెస్‌ఫుల్ సినిమా ఒక డైరెక్టర్ పై నటుడికి ఎంతటి నమ్మకాన్ని కలిగించగలదో, అలాగే ఆ నమ్మకం కొత్త ప్రాజెక్టులకు ఎలా బాటలు వేస్తుందో ఇది ఉదాహరణగా నిలుస్తోంది. మరి వెంకీపై సూర్య పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నెగ్గుతుందో చూడాలి. విశ్వనాథ్& సన్స్ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.