సూర్య కెరియర్లో సీన్ కీలకంగా మారనుందా?

సాధారణంగా ఏ భాష ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో వరుసగా రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు అంటే.. ఆ తర్వాత వచ్చే మూవీపై ఖచ్చితంగా అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు.

Update: 2026-10-15 15:30 GMT

సాధారణంగా ఏ భాష ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో వరుసగా రెండు చిత్రాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు అంటే.. ఆ తర్వాత వచ్చే మూవీపై ఖచ్చితంగా అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు. అందుకే ఆ రెండు చిత్రాల తర్వాత వచ్చే మూడవ సినిమా ఆ హీరోల కెరియర్ లో అత్యంత కీలకంగా మారుతుంది. సరిగ్గా ఇప్పుడు సూర్య కెరియర్ లో కూడా 'సీన్' మూవీ కీలకంగా మారనుందా అంటే అవుననే చెప్పాలి .అయితే ఇంతటి ప్రతిష్టాత్మక మూవీ కోసం నిర్మాతలు జాగ్రత్త పడకపోవడం అభిమానులను ఆందోళనపరుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సీన్ ప్రమోషన్స్ లో ఫ్యాన్స్ అసంతృప్తి..

సాధారణంగా ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటే నెలల తరబడి సినిమాను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. కానీ సీన్ సినిమా విషయంలో అది ఏది కనిపించడం లేదు. విడుదల తేదీ దగ్గర పడుతున్నా.. విడుదలకు కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నా.. చిత్ర బృందం మాత్రం ఇంకా ప్రచారాన్ని సరిగ్గా ప్రారంభించలేదు. దీనికి తోడు ఇటీవల ఈ సీన్ నుండి విడుదలైన మొదటి పాట కూడా పెద్దగా ప్రభావం సృష్టించలేకపోయింది. దీంతో సరైన ప్రచారం లేకపోవడం వల్లే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉన్న సినిమాను డిజాస్టర్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అందుకే సీన్ ప్రమోషన్స్ ను వెంటనే మొదలు పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

సూర్య కెరియర్లో సీన్ కీలకం..

ఇకపోతే కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో వరుసగా కమర్షియల్ సక్సెస్ అందుకున్న సూర్యకి ఇప్పుడు ఈ సీన్ మూవీ అత్యంత కీలకంగా మారింది. ఈ సినిమాతో ఆయన మళ్లీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంటే గనుక వరుస విజయాలతో హ్యాట్రిక్ అందుకున్న హీరోగా తన ఖాతాలో మరో రికార్డును చేర్చుకుంటారు. అయితే ఈ సినిమాకి ఒకవైపు ప్రమోషన్స్ పెద్దగా జరగకపోయినా.. ఈ సినిమాలోని పలు అంశాలే సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.

ప్రమోషన్స్ నిల్ .. కానీ భారీ హైప్..

ఈ సినిమాకు ఒకవైపు ప్రమోషన్స్ సరిగ్గా జరగడం లేదు అని అభిమానులు ఆందోళన చెందుతున్నప్పటికీ.. సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి కారణం సూర్య గత రెండు చిత్రాల విజయాలు, ఇందులో మలయాళ నటుడు నస్లేన్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ అరంగేట్రం చేయడం, పైగా జితు మాధవన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం.. అన్నీ ఈ సినిమాకు బాగా కలిసొస్తున్నాయి. ఇక నవంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమా మంచి విజయం అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలు..

ఇదిలా ఉండగా మరొకవైపు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అక్టోబర్ 21న చెన్నైలో, అక్టోబర్ 25న దుబాయ్ లో, నవంబర్ 2న హైదరాబాదులో, నవంబర్ 4న కొచ్చిలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్లను ప్లాన్ చేశారట. ముఖ్యంగా మేకర్స్ సీన్ సినిమా తుది ఫలితం పై చాలా నమ్మకంగా ఉన్నారని, అందుకే పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారని, ఇక సోషల్ మీడియాలో వస్తున్న ఊహగానాలకు ప్రతిస్పందనగా ఈ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించడానికి సరైన సమయం కోసం నిర్మాతలు వేచి చూస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News