నా జీవితగాథ నాతోనే సమాధి అవుతుంది : బయోపిక్‌పై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం, సినిమాలు, ఆలోచనలపై ఇటీవల ఒక రియాలిటీ షోలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Update: 2026-10-15 11:30 GMT

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ తన వ్యక్తిగత జీవితం, సినిమాలు, ఆలోచనలపై ఇటీవల ఒక రియాలిటీ షోలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే తన బయోపిక్ అంశంపై సల్మాన్ స్పందిస్తూ సంచలన ప్రకటన చేశారు. తన జీవిత ఆధారంగా తెరకెక్కించే బయోపిక్ ఎప్పటికీ రాదని.. తన జీవితగాథ తనతోనే సమాధి అయిపోతుందని స్పష్టం చేశారు.

అయితే ఒకవేళ తన జీవితం ఆధారంగా సినిమా తీయాల్సి వస్తే ఏ దర్శకుడిని ఎంచుకుంటారని ప్రముఖ నటి కరిష్మా కపూర్ అడిగిన ప్రశ్నకు సల్మాన్ చాలా సరదాగా బదులిచ్చారు. తన జీవితంలో ఉన్న రకరకాల షేడ్స్ .. ఘట్టాలకు అనుగుణంగా విభిన్నమైన బాలీవుడ్ దర్శకుల పేర్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తన జీవితంలో ప్రతి ఘట్టానికి సరిపోయే దర్శకుడిని ఆయన సూచించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన హాస్యభరితమైన సన్నివేశాలు..కామెడీ కోణాన్ని ఆవిష్కరించడానికి ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ సరైన వ్యక్తి అని పేర్కొన్నారు. అలాగే తన జీవితంలోని యాక్షన్, అడ్వెంచర్ , ప్రేమ ఘట్టాలను తెరకెక్కించడానికి కబీర్ ఖాన్ అయితే నూటికి నూరు శాతం న్యాయం చేయగలరని సల్మాన్ అభిప్రాయపడ్డారు.

ఇక తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు.. చేదు అనుభవాలు.. విషాదకరమైన సంఘటనల (ట్రాజెడీ) తీవ్రతను చూపించాలంటే అది కేవలం సంజయ్ లీలా భన్సాలీ వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు. అదే సమయంలో తనలోని అచ్చమైన స్వచ్ఛమైన ప్రేమను, కుటుంబ బంధాల (ప్యూర్ లవ్ స్టోరీ) కోణాన్ని తెరపైకి తీసుకురావడానికి మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హైన్ కౌన్ చిత్రాల దర్శకుడు సూరజ్ బర్జాత్యానే సరైన ఎంపిక అని తెలిపారు.

ఈ రకంగా తన జీవితంలోని ఒక్కో రసానికి ఒక్కో దిగ్గజ దర్శకుడి పేరును ప్రతిపాదిస్తూ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తన జీవితం అన్ని రకాల భావోద్వేగాలు నిండిన ఒక సుదీర్ఘ ప్రయాణమని పరోక్షంగా చెబుతూనే... తన బయోపిక్ అనేది స్క్రీన్ పైకి రాదని... అది కేవలం తన సొంత జ్ఞాపకాలతోనే మిగిలిపోతుందని భాయిజాన్ ముక్తాయించారు.

Tags:    

Similar News