ఉక్రెయిన్ : పోయాం మోసం అంటున్న జెలెన్ స్కీ !
‘రష్యాతో అమెరికా డీజిల్ ఒప్పందం పుతిన్ కు ఇచ్చిన బహుమతి. అమెరికా బలహీనత. ఇది రష్యాకు యుద్దం కొనసాగించేందుకు అర్థికంగా సహాయపడుతుంది.
‘రష్యాతో అమెరికా డీజిల్ ఒప్పందం పుతిన్ కు ఇచ్చిన బహుమతి. అమెరికా బలహీనత. ఇది రష్యాకు యుద్దం కొనసాగించేందుకు అర్థికంగా సహాయపడుతుంది. మరిన్ని మరణాలకు దారి తీస్తుంది. మేము బలమైన భాగస్వామిని కోల్పోతున్నాం. ట్రంప్ రష్యా వైపు ఎంచుకోవడం బాధాకరం. మేము దేశాన్ని అమ్ముకోము. ట్రంప్ సలహాదారులు ఆయనను తప్పు వైపు నెడుతున్నారని అనుమానంగా ఉంది. ఉక్రెయిన్ సార్వభౌమత్వం, భూభాగాల విషయంలో రాజీపడేది లేదు’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అభిప్రాయపడ్డాడు.
ట్రంప్ ప్రకటనలపై జెలెన్ స్కీ ఆశ్చర్యం, నిరాశ వ్యక్తం చేయడమే కాకుండా హెచ్చరికలు కూడా చేయడం గమనార్హం. ట్రంప్ ఎనర్జీ సీజ్ ఫైర్ ప్రకటించినప్పుడు రష్యా అంగీకరిస్తే ఉక్రెయిన్ అంగీకరిస్తుందని అన్నాడు. అమెరికా నుంచి వచ్చే వివరాల కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కూడా రష్యా ఉక్రెయిన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ కేంద్రాల మీద దాడులు కొనసాగించిందని జెలెన్ స్కీ వెల్లడించాడు.
అమెరికాలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలు, పెరుగుతున్న ఇంధన ధరలు, యుద్దం త్వరగా ముగించాలని అన్ని వైపుల నుండి వస్తున్న వత్తిడి రష్యాతో ట్రంప్ ఒప్పందానికి దారితీసినట్లు తెలుస్తుంది. మిడ్ టర్మ్ ఎన్నికల నేపథ్యంలో అమెరికాలో డీజిల్, ఇంధన ధరలు తగ్గించాలనే రాజకీయ అవసరం ఉంది. అందుకే రష్యా డీజిల్ ఎగుమతుల విషయంలో వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరకు అమెరికా ఆంక్షలు ఎత్తివేసింది.
ఉక్రెయిన్ రష్యా రిఫైనరీల మీద దాడులు చేయడాన్ని ట్రంప్ ఇంధన ధరలు పెంచేవిగా చూస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఉక్రెయిన్ మీద వత్తిడి తేవడంతో పాటు, ఎనర్జీ సీజ్ ఫైర్ అని తానే ప్రకటించి, నేను అన్నాను కాబట్టి అంగీకరించారు అన్న ప్రచారం చేస్తున్నట్లు చెబుతున్నారు. జెలెన్ స్కీకన్నా పుతిన్ ఎక్కువగా ఒప్పందానికి సిద్దం అన్నందుకే రష్యాతో డీల్ ఓకే చేసినట్లు తెలుస్తుంది.
అయితే అమెరికా రష్యాతో చేసుకున్న ఒప్పందం తాత్కాలికంగా ధరలు తగ్గించవచ్చు కానీ రష్యాకు ఆర్థిక స్వేచ్చ, ఉక్రెయిన్ పై వత్తిడి మూలంగా యూరోపియన్ భద్రతను బలహీనపరుస్తుంది అని భావిస్తున్నారు. ఇక ఉక్రెయిన్ నాలుగు సంవత్సరాల యుద్దం తరువాత భూభాగాలు వదులు కోవడం, బలహీనమైన గ్యారంటీలను అంగీకరించడం కష్టం అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జెలెన్ స్కీ ఇది వ్యాపారం కాదు మనుగడ అని అని భావిస్తున్నా, అమెరికా మద్దతు తగ్గితే ఉక్రెయిన్ పరిస్థితి మరింత దిగజారుతుంది అని అంటున్నారు.