శ్రీలీల ముందు అతిపెద్ద సవాల్.. ఎదుర్కొంటుందా?

శ్రీ లీల.. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతాం.

Update: 2026-10-15 14:30 GMT

శ్రీ లీల.. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆవగింజంత అదృష్టం ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతాం. ఇక్కడే కాదు ఎక్కడైనా సరే.. కష్టపడే గుణం , ప్రతిభ, అదృష్టం ఉంటే అందలం ఎక్కవచ్చని ఇప్పటికే ఎంతోమంది తారలు నిరూపించారు కూడా.. అయితే ఎంత అందంగా ఉన్నా.. నటించగలిగే సత్తా ఉన్నప్పటికీ...అదృష్టం లేకపోతే అవకాశాలు తలుపు తట్టవు. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించి, ఆ తర్వాత కనుమరుగైన తారల గురించి అభిమానులు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటారు . మళ్లీ తమ అభిమాన నటీనటులు తెరపై ఎప్పుడు కనిపిస్తారు ? ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేస్తారు? అని క్షుణ్ణంగా ఆరా తీస్తూ ఉంటారు.

అలాంటి వారిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన యంగ్ బ్యూటీ శ్రీ లీల.. అందం, అభినయం, అంతకుమించిన ప్రతిభ ఉన్నప్పటికీ.. కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల శ్రీ లీల వెనుకబడిపోతోంది అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్రీ లీల.. ఆ తర్వాత చేసిన ధమాకా సినిమాతో ఇండస్ట్రీ హిట్టును తన ఖాతాలో వేసుకుంది . ఆ తర్వాత చేసిన గుంటూరు కారం, భగవంత్ కేసరి, స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి ఇలా ఏ సినిమా కూడా ఈమెకు విజయాన్ని అందించలేదు.

ముఖ్యంగా పుష్ప 2: ది రూల్ చిత్రంలో తొలిసారి స్పెషల్ సాంగ్ లో నర్తించింది. పాటకు ఫుల్ క్రేజ్ వచ్చింది. కానీ శ్రీ లీలాకు మాత్రం అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. అయితే ప్రస్తుతం ఈమె చేతిలో ఆర్యన్ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ ల ప్రాజెక్టులు మినహా మరో ప్రాజెక్టులో నటిస్తున్నట్లు ఎక్కడ అధికారిక ప్రకటన లేదు.

వరుసగా తెలుగులో డిజాస్టర్లు అందుకున్న ఈమెకు మళ్లీ తెలుగులో అవకాశం లభించిందా అంటే చెప్పలేని పరిస్థితి.అయితే ఈమె మాత్రం ఇటీవల ఒక ప్రైవేటు కార్యక్రమంలో మాట్లాడుతూ వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నానని, అయితే రాబోయే చిత్రాల బృందాలు ఇంకా ఆ ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించలేదని, అందుకే తాను ఆ వివరాలు వెల్లడించలేనని స్పష్టం చేసింది.. ఇకపోతే తాను వరుస సినిమాలలో నటిస్తున్నానని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించినా.. అసలు ఈమె ఏ సినిమాలో నటిస్తోంది? ఏ ప్రాజెక్టుతో ప్రేక్షకులను మెప్పించబోతోంది ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరి శ్రీ లీల మళ్లీ మునుపటి వైభవాన్ని తెచ్చుకోవాలి అంటే.. కచ్చితంగా ఆమె ఖాతాలో ఒక పెద్ద కమర్షియల్ సక్సెస్ అవసరం. అంతకంటే ముఖ్యంగా ఆమె నటన , పాత్ర ఆ సినిమా విజయానికి గణనీయంగా దోహదపడే చిత్రం ఆమెకు కావాలి. ఇక సరైన ప్రాజెక్టును పట్టుకొని తెలుగు కెరియర్ ను తిరిగి గాడిలో పెట్టగలదా ? లేదా ? అన్నది వచ్చే ప్రాజెక్టులతో తేలనుంది. మరి ఈ సవాల్ ను ఆమె ఎదుర్కొని , మంచి సక్సెస్ అందుకొని మళ్ళీ కం బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News