ట్రెడిషనల్ లుక్ లో రష్మిక రాయల్ వైబ్!
రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ కాదు బాక్స్ ఆఫీస్ క్వీన్ అనే రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ కాదు బాక్స్ ఆఫీస్ క్వీన్ అనే రేంజ్ లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కన్నడ బ్యూటీ అయిన రష్మిక మందన్న ఇటు తెలుగు, హిందీ చిత్రాలతో ఆడియన్స్ హృదయాలను దోచుకుంటుంది. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హీరోయిన్గా మరింత బిజీగా మారిన రష్మిక మందన్న వివాహం తర్వాత తన భర్తతో కలిసి నటిస్తున్న తొలి చిత్రం రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో.. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 16న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
వివాహం తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అటు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా దేవాలయాలను సందర్శిస్తూ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే నేడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న ఈ జంట.. కాసేపటి క్రితం సత్యసాయిబాబా ప్రశాంతి నిలయంలో సందడి చేశారు..
మరొకవైపు సేవా కార్యక్రమాలను చేపడుతూ వేగంగా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. అందులో భాగంగానే ప్రాజెక్టు అన్నపూర్ణ పేరుతో ఏకంగా 400 కుటుంబాలను రష్మిక దత్తత తీసుకోవడమే కాకుండా మూడు నెలలకు సరిపడా ఒక్కో కుటుంబానికి అవసరమయ్యే నిత్యావసర సరుకులను కూడా అందించారు. ప్రత్యేకించి ఎనిమిది ప్రాంతాల నుండి ఎంపిక చేసిన కుటుంబాలకు ఈ ప్రత్యేక నిత్యావసర కిట్ ఇవ్వడం జరిగింది.
ఇలా అటు సోషల్ మీడియా ద్వారా అటు నేరుగా ప్రజలను కలుస్తూ మరింత ఆదరణ సొంతం చేసుకుంటుంది ఈ జంట. ఇకపోతే మరొకవైపు తన గ్లామర్ తో హుందాతనంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది రష్మిక. ఈ క్రమంలోనే తాజాగా తన జయమ్మ పాత్రను ప్రేక్షకులు ఖచ్చితంగా ఇష్టపడతారు అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ట్రెడిషనల్ వేర్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి
ఐవరీ కలర్.. గోల్డెన్ కలర్ తో డిజైన్ చేసిన బోర్డర్ కట్ ప్లెయిన్ శారీని కట్టుకున్న ఈమె.. దీనికి కాంబినేషన్లో హెవీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన ఫుల్ స్లీవ్ రెడ్ కలర్ బ్లౌజ్ ధరించి , రాయల్ లుక్ లో అందరి దృష్టిని ఆకట్టుకుంది. పూసలతో డిజైన్ చేసిన సింపుల్ చౌకర్ ను ధరించి, తన లుక్ ను పర్ఫెక్ట్ గా మార్చుకున్న రష్మిక మందన్న.. తన జుట్టును ముడి వేసి మరింత అందంగా కనిపించింది. ఈ చీరకట్టులో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే రాయల్ వైభవం ఉట్టిపడేలా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకొక రోజే.. అంతా మంచి జరగాలని.. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని.. జయమ్మను మీరు మరింత ప్రేమించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ క్యాప్షన్ జోడించింది.. మొత్తానికైతే రష్మిక ట్రెడిషనల్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.