'వృషకర్మ' కొత్త పోస్టర్‌తో కౌంట్‌డౌన్ స్టార్ల్: నాగచైతన్య పవర్ఫుల్ మాస్ లుక్ వైరల్
`తండేల్` వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన.. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న `వృషకర్మ`తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
`తండేల్` వంటి భారీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన.. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న `వృషకర్మ`తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. `విరూపాక్ష` చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డు విజయాన్ని అందుకున్న ప్రతిభావంతుడైన దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లింగ్ అడ్వెంచర్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ మైథికల్ విజువల్ వండర్‌పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో - ప్రేక్షకులలో అపారమైన అంచనాలు నెలకొన్నాయి.
సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కావడానికి సరిగ్గా 50 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న సందర్భంగా... చిత్ర యూనిట్ ఒక ఉద్వేగభరితమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేసి విడుదలకు కౌంట్‌డౌన్ ప్రారంభించింది. ఈ కొత్త పోస్టర్లో నాగచైతన్య అత్యంత సీరియస్ ఎక్స ప్రెషన్స్.. సరికొత్త రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. రాళ్లు, దుమ్ము ధూళితో నిండిన ఒక విధ్వంసకర బ్లాస్టింగ్ వాతావరణంలో.. మెటాలిక్ బ్లేడ్‌తో కూడిన ఒక ప్రత్యేకమైన తాడు - గ్రాప్లింగ్ హుక్ ఆయుధాన్ని పట్టుకుని పర్వతాలపైకి ఎక్కేందుకు సిద్ధమవుతున్న అతడి రూపం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ భారీ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, `లపతా లేడీస్` ఫేమ్ స్పర్ష్ శ్రీవాస్తవ్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్లోకి అరంగేట్రం చేస్తూ ప్రధాన విలన్‌గా విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్.వి.సి.సి) -సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బాపినీడు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు అజనీష్ బి లోక్‌నాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ - రాహుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
నాగచైతన్య కెరీర్లోనే మునుపెన్నడూ లేని స్థాయిలో అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించిన చిత్రంగా `వృషకర్మ` రికార్డులకెక్కింది. ట్రెజర్ హంటర్ నేపథ్యంలో సాగే ఈ మిస్టికల్ అడ్వెంచర్ కోసం చైతూ భారీగా మేకోవర్ అయ్యారు. దర్శకుడు కార్తీక్ దండు మునుపెన్నడూ చూడని ఒక సరికొత్త రసవత్తరమైన ప్రపంచాన్ని స్క్రీన్‌పై ఆవిష్కరిస్తుండగా.. ఈ చిత్రం ఈ ఏడాది బిగ్ స్క్రీన్‌పై ప్రేక్షకులకు అతిపెద్ద మరపురాని థియేట్రికల్ అనుభూతిని అందిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.
అన్ని రకాల ప్రమోషనల్ కంటెంట్, టీజర్, గ్లింప్స్‌లతో ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన ఈ మైథాలజీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 4 డిసెంబర్ 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది. దసరా రేసు నుంచి డిసెంబర్ రేసులోకి అడుగుపెట్టిన ఈ చిత్రం అక్కినేని అభిమానులకు .. సస్పెన్స్ థ్రిల్లర్ ప్రియులకు థియేటర్లలో విజువల్ విందును అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టీజర్ లో, తాజా పోస్టర్ లో లుక్ చూసాక `ది మమ్మీ` హీరో బ్రెండన్ ఫ్రాజర్లా నాగచైతన్య సాహసాలు చేయబోతున్నాడు! అంటూ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు.