అన్నదమ్ముల సినిమాలకు ఏమైంది బాసు..?

అందులో ఒకరేమో వరుస సినిమాలు చేస్తున్నా కూడా హిట్ దక్కక ఇబ్బందులు పడుతుంటే మరొకరికి హిట్లు పడుతున్నా కూడా నెక్స్ట్ సినిమాకు బజ్ రావట్లేదు.;

Update: 2025-09-16 05:41 GMT

కోలీవుడ్ స్టార్ హీరోలైన ఇద్దరికి అసలేమాత్రం టైం కలిసి రావట్లేదని చెప్పొచ్చు. అందులో ఒకరేమో వరుస సినిమాలు చేస్తున్నా కూడా హిట్ దక్కక ఇబ్బందులు పడుతుంటే మరొకరికి హిట్లు పడుతున్నా కూడా నెక్స్ట్ సినిమాకు బజ్ రావట్లేదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆ హీరోలిద్దరు అన్నదమ్ములు అవ్వడమే. ఇంతకీ ఈ లీడ్ ఎవరి గురించో మీకు కూడా అర్ధమై ఉండొచ్చు.

సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్..

తమిళ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు సూర్య, కార్తి. సూర్య అయితే దాదాపు రెండు దశాబ్దాలుగా తన మార్క్ సినిమాలతో ఫ్యాన్స్ అండ్ ఆదియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. తమిళ్ లోనే కాదు సూర్యకు తెలుగులో కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. అదే తరహాలో సూర్య తమ్ముడు కార్తికి కూడా తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఐతే తమిళ్ లో వీరిద్దరి సినిమాలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

సూర్య లేటెస్ట్ సినిమా కరుప్పు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఆర్జె బాలాజి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఫైనల్ చేయలేదు. సినిమా థియేట్రికల్ బిజినెస్ సోసోగానే ఉందట. ఐతే సూర్య కరుప్పు సినిమా డిజిటల్ రైట్స్ ఇంకా సేల్ అవ్వలేదని టాక్. ఆర్జె బాలాజి డైరెక్షన్ అవ్వడం సూర్య సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించకపోవడం వల్ల కరుప్పు సినిమాపై ఓటీటీ సంస్థలు ఇంట్రెస్ట్ చూపించట్లేదట.

సూర్య సినిమాను డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు నిర్మించారు. ఈ ప్రొడక్షన్ హౌస్ సినిమాలకు కూడా అంతగా డిమాండ్ ఉండట్లేదని టాక్. మరోపక్క కార్తి చేసిన సర్దార్ 2 సినిమా కూడా ఓటీటీ రైట్స్ సేల్ అవ్వలేదని తెలుస్తుంది.

సర్దార్ సినిమా సూపర్ హిట్..

పి.ఎస్ మిత్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సర్దార్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ 2 వస్తుంది. ఈ సినిమాను ప్రిన్స్ పిక్చర్స్, ఐ.వి.వై ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో లక్ష్మణ్ కుమార్, ఇషాన్ సక్సేనా నిర్మిస్తున్నారు. ఐతే ఈ సినిమాకు సంబందించిన డిజిటల్ రైట్స్ ని కూడా ఎవరు తీసుకోలేదని టాక్. సర్దార్ సినిమా 2022 లో వచ్చి సక్సెస్ అయ్యింది. మరి సూపర్ హిట్ సీక్వెల్ కి ఈ ఓటీటీ రైట్స్ కష్టాలు ఏంటో అర్ధం కావట్లేదు.

సూర్య, కార్తి చేస్తున్న సినిమాలు వారికున్న ఇమేజ్ కి తగినట్టుగా బిజినెస్ లు జరగట్లేదు. ఐతే అసలు ఎక్కడ తేడా జరుగుతుంది అన్నది గమనించాలి. సూర్య 46వ సినిమా వెంకీ అట్లూరి డైరెక్షన్ లో వస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను సెట్స్ మీద ఉండగానే నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్ కొనేసింది. మరి కరుప్పు ఓటీటీ హక్కుల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News