సూర్య సినిమా రీ రిలీజ్.. డైరెక్టర్ కి ప్లస్ అవుతుందా..?

అంజాన్ 2014లో రిలీజైన ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేయగా సినిమాలో హీరోయిన్ గా సమంత నటించింది.;

Update: 2025-11-27 03:57 GMT

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ఒక సినిమా రీ రిలీజ్ హంగామా మొదలైంది. ఐతే 11 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా అప్పట్లో పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఐతే ఆ తర్వాత మాత్రం ఆ సినిమా గురించి డిస్కస్ చేస్తూ వచ్చారు. 11 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ సినిమా రీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా డైరెక్టర్ కూడా అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ రీ రిలీజ్ పై ఆసక్తిగా ఉన్నాడు. ఇంతకీ ఏ సినిమా గురించి ఇదంతా అంటే.. సూర్య, లింగుసామి కాంబినేషన్ లో వచ్చిన అంజాన్ సినిమా గురించే అన్నమాట.

తమిళ్ తో పాటు తెలుగులో కూడా..

అంజాన్ 2014లో రిలీజైన ఈ సినిమాలో సూర్య డ్యూయల్ రోల్ చేయగా సినిమాలో హీరోయిన్ గా సమంత నటించింది. ఈ సినిమాను తెలుగులో సికిందర్ అనే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఐతే తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు పట్టించుకోలేదు. అప్పట్లో సూర్య మంచి ఫాం లో ఉండగా అతని ఫాం కి ఈ సినిమా బ్రేక్ వేసినట్టు అయ్యింది.

సూర్య సినిమా రీ రిలీజ్ టైంలో డైరెక్టర్ లింగుసామి ఆ సినిమా రిలీజ్ టైంలో కొన్ని కారణాల వల్ల ఎడిటింగ్ సరిగా చేయలేదని.. ఐతే ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ ఆకట్టుకుందని అన్నారు. లింగుసామి అంజాన్ అదే సికిందర్ సినిమా రీ రిలీజ్ ని తనకి ప్లస్ అయ్యేలా చేసుకోవాలని చూస్తున్నారు. రామ్ తో ది వారియర్ తర్వాత 3 ఏళ్లుగా లింగుసామికి మరో మూవీ ఛాన్స్ రాలేదు.

లింగుసామి యాక్షన్ సినిమాలు..

పాతికేళ్ల కెరీర్ లో 10 సినిమాలు మాత్రమే చేసిన లింగుసామి తిరిగి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. అప్పట్లో తెలుగు స్టార్స్ తో లింగుసామి కథాచర్చలు అంటూ హడావిడి చేశారు కానీ ఆయన ఫాంలో లేరని తెలిసి సైలెంట్ అయ్యారు. లింగుసామి యాక్షన్ సినిమాలను తెలుగు ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఆవారా సినిమా తెలుగులో సక్సెస్ అయ్యింది. పందెంకోడి సూపర్ హిట్ అయ్యింది. ఐతే మళ్లీ పందెం కోడి లాంటి సినిమా తీసిన లింగుసామిని చూడాలని ఆడియన్స్ కోరుతున్నారు.

రామ్ తో ది వారియర్ అటెంప్ట్ కూడా నిరాశపరచడంతో లింగుసామికి ఛాన్స్ లు లేకుండా అయ్యాయి. అంజాన్ సినిమా రీ రిలీజ్ లింగుసామికి ఏమైనా కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి. లింగుసామి కూడా అంజాన్ రీ రిలీజ్ టైం లో యాక్టివ్ గా ఉండటం వల్ల తనకు ఎంతోకొంత హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు.

Tags:    

Similar News