• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తెలుగులో అక్షయ్ కుమార్...

తెలుగులో అక్షయ్ కుమార్ లేటెస్ట్ హిట్

| బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ తెలుగులో రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

By - Tupaki Desk
Update: 2025-05-14 07:57 GMT

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ హిస్టారికల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలా బాగ్’ తెలుగులో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. బ్రిటిష్ కాలనీ దురాగతాలను ఎదిరించిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ ధైర్యసాహసాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా హిందీలో ఏప్రిల్ 18 విడుదలై బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 100 కోట్ల వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఈ నెల 23న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. జలియన్‌వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో రూపొందిన ఈ ‘కేసరి 2’ సినిమా ధర్మ ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మితమైంది. ఇక తెలుగు రిలీజ్‌ను సురేష్ ప్రొడక్షన్స్ భారీగా ప్లాన్ చేస్తోంది. కరణ్ సింగ్ త్యాగి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా, హిందీలో విడుదలైన తర్వాత జాతీయ స్థాయిలో మంచి ఆదరణ పొందింది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బజ్ పెరుగుతోంది, దీంతో ఇక్కడ కూడా భారీ విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా టేబుల్ ప్రాఫిట్ సాధించింది, అయితే థియేటర్లలో కూడా ఆడియన్స్‌ను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ‘కేసరి 2’ తెలుగు విడుదల కూడా అభిమానులను ఆకర్షించే అవకాశం ఉంది. అక్షయ్ కుమార్‌తో పాటు ఆర్. మాధవన్, అనన్యా పాండే కీలక పాత్రల్లో నటించారు, వీరి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సినిమా కథ 1919 జలియన్‌వాలా బాగ్ మారణకాండ చుట్టూ తిరుగుతుంది. బ్రిటిష్ సైన్యం అమాయక ప్రజలపై కాల్పులు జరపడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ సంఘటనను ఎదిరించి, న్యాయం కోసం పోరాడిన న్యాయవాది సి. శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ నటించాడు.

ఈ సినిమా రఘు పాలత్, పుష్ప పాలత్ రాసిన ‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’ పుస్తకం ఆధారంగా రూపొందింది. ఈ కథ తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశిస్తున్నారు. మొత్తంగా, ‘కేసరి 2’ తెలుగు విడుదల సురేష్ ప్రొడక్షన్స్ బ్యాకింగ్‌తో గ్రాండ్‌గా జరగనుంది. ఈ నెల 23న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Tags:    
  • AkshayKumar 
  • KesariChapter2 
  • JallianwalaBagh 
  • RMadhavan 
  • AnanyaPanday 
  • CSankaranNair 
  • KaranSinghTyagi 
  • KesariChapter2Movie 

Similar News

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

Copyright @2026

Powered by Blink CMS