• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తండ్రికి తగ్గ తనయుడు.....

తండ్రికి తగ్గ తనయుడు.. హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్..!

| కేవలం స్టార్ హీరో గానే కాదు మంచి మనిషిగా కూడా మహేష్ అభిమానుల మనసులు గెలుస్తున్నాడు

By - Tupaki Desk
Update: 2023-08-09 04:26 GMT

సూపర్ స్టార్ కృష్ణ హీరోగా సూపర్ ఫాం లో ఉన్నప్పుడే తన తనయులు ఇద్దరిని తెరంగేట్రం చేయించాడు. కృష్ణ పెద్ద కొడుకు రమేష్ ని హీరోగా పరిచయం చేయగా మహేష్ ని మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. సినిమాతో మొదలైన మహేష్ సినిమా కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక రాజకుమారుడుతో హీరోగా చేసిన మహేష్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.


మురారి సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైన మహేష్ ఒక్కడుతో యూత్ ఆడియన్స్ ని మెప్పించాడు. పోకిరితో ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టాడు. దూకుడు, బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట ఇలా తను చేస్తున్న సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమ సత్తా చాటుతూ వస్తున్నాడు మహేష్. స్టార్ ఇమేజ్ వచ్చాక పూర్తిగా కమర్షియల్ సినిమా చేసినా వర్క్ అవుట్ అవుతుంది. కానీ ఒక సినిమా చేస్తున్నాం అంటే అందులో ఏదో ఒక కథ ఉండాలని కోరుకునే హీరో మహేష్.

అప్పట్లో కృష్ణ గారు ఎలాగైతే ప్రయోగాలు చేశారో ఈ తరంలో మహేష్ కూడా అలానే రకరకాల ప్రయోగాలు చేస్తూ వచ్చారు. స్టార్ హీరోలు రిస్క్ చేస్తే ఆ సినిమాల ఫలితాలు కూడా వారి కెరీర్ మీద ఎఫెక్ట్ పడేలా చేస్తాయి. అయినా సరే ఎక్కడా తగ్గకుండా మహేష్ సినిమాలు చేస్తూ వచ్చాడు. హీరోగా తన స్థాయిని పెంచుకుంటూ వచ్చి సూపర్ స్టార్ ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు మహేష్.

కేవలం స్టార్ హీరో గానే కాదు మంచి మనిషిగా కూడా మహేష్ అభిమానుల మనసులు గెలుస్తున్నాడు. సమాజ సేవలో కూడా మహేష్ ఎప్పుడూ ముందుంటాడు. ఆల్రెడీ మహేష్ ఏపీలో ఒక గ్రామం, తెలంగాణాలో మరో గ్రామం దత్తత తీసుకుని డెవెలప్ చేశారు.

ఇక మరోపక్క ఆంధ్రా హాస్పిటల్ తో కలిసి చిన్న పిల్లల గుండె ఆపరేషన్ లకు సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 1200 పైగా పిల్లలకు మహేష్ ఆపరేషన్ చేయించి వారు హృదయాలను గెలిచాడు.

మహేష్ కటౌట్ కి సరైన కథ పడితే చాలు అది రికార్డులు సృష్టించడం ఖాయం. ప్రస్తుతం మహేష్ త్రివిక్రం డైరెక్షన్ లో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మహేష్ ఇలాంటి బర్త్ డే లు మరెన్నో జరుపుకోవాలని కోరుతుంది టీం తుపాకి.కామ్.

Tags:    
  • Superstarkrishna 
  • Maheshbabu 
  • Birthdaycelebration 
  • Adoption 
  • Andhrapradesh 
  • Telangana 
  • Villages 
  • Gunturkaaram 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS