• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇది నా ఇల్లు.. నా ప్రజల...

ఇది నా ఇల్లు.. నా ప్రజల భాష

| నా మూలాలు, జ్ఞాపకాలు, నా ప్రజలు, నా ఇల్లు అన్నీ ఈ భాషలోనే ఉన్నాయి` అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

By - Srikanth Kontham
Update: 2026-09-20 02:30 GMT

దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో తులు భాషకు అదనపు అధికారిక భాషా హోదా కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తన హృదయానికి ఎంతో దగ్గరైందని, తన మాతృభాషకు దక్కిన ఈ గౌరవం పట్ల ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం అనంతరం సునీల్ శెట్టి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.`ఇది కేవలం నేను మాట్లాడే భాష మాత్రమే కాదు. నేను ఎవరిని అనేదానికి నిదర్శనం.

నా మూలాలు, జ్ఞాపకాలు, నా ప్రజలు, నా ఇల్లు అన్నీ ఈ భాషలోనే ఉన్నాయి` అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తరతరాలుగా ఈ భాషను, సంస్కృతిని ప్రేమతో కాపాడుకుంటూ వస్తున్న ప్రతి తులువాకి ఇది గర్వకారణమైన రోజని కొనియాడారు. సెప్టెంబర్ 18న మంగళూరులో జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో కర్ణాటక క్యాబినెట్ ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తులు భాష ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ కన్నడ , ఉడుపి జిల్లాల్లో పాలనాపరమైన అవసరాల కోసం తులు భాషకు అదనపు అధికారిక భాషా హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో ఆయా జిల్లాల పరిధిలోని ప్రజల సుదీర్ఘకాల స్వప్నం నెరవేరినట్లయింది. సునీల్ శెట్టికి తులు భాష , ఆ ప్రాంతంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. మంగళూరు సమీపంలోని ముల్కి ప్రాంతానికి చెందిన తులు మాట్లాడే `బంట్` కుటుంబంలో ఆయన జన్మించారు. బాలీవుడ్‌లో ఎంతటి విజయాన్ని అందుకున్నా? తన మూలాలను, సంస్కృతిని ఎప్పుడూ మరచిపోకుండా పబ్లిక్ జీవితంలో ప్రాంతీయ గుర్తింపును సగర్వంగా చాటుకోవడం సునీల్ ప్రత్యేకత.

తులు చిత్రపరిశ్రమలో కూడా సునీల్ శెట్టి అడుగు జాడ‌లున్నాయి. నటుడు , దర్శకుడు రూపేష్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన `జై` అనే కన్నడ-తులు పొలిటికల్ డ్రామా చిత్రంలో అతిథి పాత్రలో నటించడం ద్వారా సునీల్ తులు సినీ రంగ ప్రవేశం చేశారు .2025లో విడుదలైన ఈ చిత్రం ద్వారా తన ప్రాంతీయ భాషా చిత్రాలకు కూడా మద్దతుగా నిలిచారు. ఇటీవల సునీల్ శెట్టి.. అక్షయ్ కుమార్, పరేష్ రావల్, అర్షద్ వార్సీ వంటి ప్రముఖ నటులతో కలిసి `వెల్‌కమ్ టు ది జంగిల్` చిత్రంలో నటించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం 2026న పునర్వ్య వస్థీకరించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ లోని 18 మంది సభ్యులలో ఒకరిగా సునీల్ శెట్టి నియమితులయ్యారు.

Tags:    
  • sunielshetty 
  • tulu 
  • karnataka 
  • tululanguage 
  • indianlanguages 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS