మా వాళ్ల‌ని విల‌న్ల‌గా చూపించ‌డం న‌చ్చ‌లే!

ఒక‌ప్పుడు తెలుగు సినిమాలో విల‌న్ అంటే? ఆ పాత్ర హిందీ న‌టుడు మాత్ర‌మే పోషించాలి.;

Update: 2025-11-28 07:42 GMT

ఒక‌ప్పుడు తెలుగు సినిమాలో విల‌న్ అంటే? ఆ పాత్ర హిందీ న‌టుడు మాత్ర‌మే పోషించాలి. దేశంలో ఎంతో మంది న‌టులున్నా? ప్ర‌త్యేకించి ద‌క్షిణాది న‌టులెంతో మంది ఉన్నా? తెలుగు ప్ర‌తిభావంతులున్నా కూడా హిందీ న‌టుల‌కు మాత్రమే ఆ పాత్ర బాద్య‌త‌లు అప్ప‌గించేవారు. ఆ న‌టుడి ముక్కు మోహం తెలుగు ఆడియ‌న్స్ కు తెలియ‌క‌పోయినా బ‌ల‌వంతంగా తీసుకొచ్చి మ‌రీ రుద్దేవారు. ఈ ట్రెండ్ కొన్ని ద‌శాబ్దాల పాటు కొన‌సాగింది. ఇప్పుడే కాస్త ట్రెండ్ మారింది. ద‌క్షిణాది న‌టుల‌తోపాటు, తెలుగు నటుల‌కు కూడా ప్రాధ‌న్య‌త ఇవ్వ‌డం అన్న‌ది క‌నిపిస్తుంది.

అందుకే అవ‌కాశాలు వ‌దిలేసా:

చిరంజీవి జ‌న‌రేష‌న్ హీరోల నుంచి మ‌హేష్ జ‌న‌రేష‌న్ వ‌ర‌కూ చాలా మంది హిందీ న‌టులు తెలుగు సినిమాలు చేసారు. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి సౌత్ సినిమాల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేసారు. మీరెందుకు ద‌క్షిణాదిన సినిమాలు చేయ‌డం లేదు? అంటే.. మంగళూరు మూలాలున్న తనకు సౌత్ నుంచి తరచుగా ఆఫర్లు వస్తుంటాయని, కానీ అవి చాలా వరకు నెగెటివ్ పాత్రలే కావడం తనకు నచ్చడం లేద‌న్నారు.

హిందీ న‌టుల‌ను బ‌ల‌మైన విల‌న్ల‌గా చూపిస్తుంటారు. తెర‌పై ఆ పాత్ర‌లు బాగా పండుతున్నాయి.

ర‌జ‌నీకాంత్ అభిమానిగా అందుకే:

కానీ హీరో పాత్ర వాళ్ల‌ను తీవ్రంగా డామినేట్ చేస్తుంది. హీరో ఎంట‌ర్ అయ్యే స‌రికి విల‌న్ ప్రాధాన్య‌త పూర్తిగా త‌గ్గిపోతుంది. విల‌న్ ప‌ది దెబ్బ‌లు కొడితే? హీరో ఒక దెబ్బ కొడితే చాలు. విల‌న్ ప‌ని అయిపోతుంది. ఇవి చాలా సిల్లీగా అనిపిస్తాయి. సౌత్ మేక‌ర్స్ లో ఈ ఆలోచ‌న అస్స‌లు నచ్చ‌దు. అందుకే సౌత్ లో చాలా సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చినా న‌టించ‌లేదు. ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టించిన `ద‌ర్బార్` లో మాత్రం విల‌న్ గా న‌టించాను. అందుకు కార‌ణంగా లేక‌పోలేదు. నేను ర‌జ‌నీకాంత్ అభిమానిని. ఆయ‌న‌తో క‌లిసి మ‌ళ్లీ న‌టించే అవ‌కాశం వ‌స్తుందో? లేదో? అన్న భ‌యంతో ఒకే చెప్పాను అన్నారు.

అందుకే ఆ సినిమాలో అతిధిగా:

`న‌టుడిగా మాత్ర‌మే సౌత్ లో అవ‌కాశాల‌ను వ‌దులుకుంటున్నా. కానీ అక్క‌డ మూలాలు మాత్రం ఎప్పటికీ మ‌ర్చి పోను. ప్రాంతీయ సినిమాను ఎప్పుడూ గౌర‌విస్తాను. తన మాతృభాష అయిన తుళులో నిర్మించిన `జై` అనే చిత్రంలో ఒక చిన్న అతిథి పాత్రలో నటించి ఆ సినిమాకు మద్దతుగా నిలిచారు. ఆ సినిమాను ఎంక‌రేజ్ చేయాల‌నే ఉద్దే శంతోనే అందులో న‌టించిన‌ట్లు తెలిపారు. ఏ భాష నటుల్ని అయినా ఒకే త‌ర‌హా పాత్ర‌ల‌కు ప‌రిమితం చేయ‌డం అన్న‌ది స‌రైన విధానం కాద‌న్నారు.

Tags:    

Similar News