• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మజాకా.. ఎక్కడ తేడా...

మజాకా.. ఎక్కడ తేడా కొట్టింది?

| ఇక వారితో సందీప్ కిషన్ స్ట్రాంగ్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ ఫలితం ఊహించనట్లు దక్కలేదు.

By - Tupaki Desk
Update: 2025-03-05 05:59 GMT

సందీప్ కిషన్ హీరోగా త్రినాథ్ నక్కిన దర్శకత్వం వహించిన చిత్రం మజాకా. దర్శకుడు త్రినాథ్ ఇంతకుముందు చేసిన సినిమాలు కమర్షియల్ గా మంచి రిజల్ట్ అందుకున్నాయి. టాక్ ఎలా ఉన్నా కూడా కలెక్షన్స్ బాగానే వస్తాయి అని అతని సినిమాలకు ఒక పేరుంది. ముఖ్యంగా రైటర్ ప్రసన్న - త్రినాథ్ కాంబినేషన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇక వారితో సందీప్ కిషన్ స్ట్రాంగ్ హిట్ కొట్టాలని అనుకున్నాడు. కానీ ఫలితం ఊహించనట్లు దక్కలేదు.

సినిమా విజయం కోసం కేవలం కథ బలం ఉండటం సరిపోదు. ప్రేక్షకుల మూడ్, సరైన టైమింగ్ కూడా కీలకమైన అంశాలే. కొన్ని సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలైనా, ప్రేక్షకుల అభిరుచిని పట్టించుకోకపోతే అవి బాక్సాఫీస్ వద్ద నష్టాలు తప్పించుకోలేవు. సందీప్ కిషన్ నటించిన మజాకా పరిస్థితి కూడా దాదాపు అలాంటిదే. ఈ సినిమా సరైన కంటెంట్ లేక కాదు, సరైన సమయంలో విడుదల చేయకపోవడమే సమస్య.

త్రినాథ్ నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రం, పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేశారు. దీన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ముహూర్తం పెట్టుకున్నారు. కానీ అనుకున్నట్టు కాలేదు. ఆలస్యం కావడంతో మళ్లీ మహాశివరాత్రికి రిలీజ్ చేశారు. ఈ సమయానికి ప్రేక్షకుల మూడ్ మారిపోయింది. సంక్రాంతికి వచ్చిన పెద్ద సినిమాలే కాకుండా, మధ్యలో వచ్చిన కొన్ని చిన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. దాంతో మజాకా కోసం థియేటర్స్‌కు వచ్చే ఆసక్తి ప్రేక్షకుల్లో తగ్గిపోయింది.

ఈ పరిస్థితుల్లో సినిమా ప్రేక్షకులను ఎంతవరకు థియేటర్లకు రప్పించగలదో అన్నదే ప్రశ్న. అంతేకాదు, విడుదలకు సరైన టైమింగ్ ఎంచుకోకపోతే మరో సమస్య ఎదురవుతుంది. ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. యూత్ ఫోకస్ అంతా క్రికెట్‌పైనే ఉంది. వారం రోజులు సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి ఉండదు. ముఖ్యంగా, బుక్ మై షో ట్రెండ్స్ చూస్తే స్పష్టంగా తెలుస్తోంది. క్రికెట్, ఇతర వినోదాలకు ప్రాధాన్యం ఇస్తున్న జనాలు కొత్త సినిమాల వైపు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

ఈ సినిమా సంక్రాంతికి విడుదలై ఉంటే తండ్రి కొడుకుల కథకు మంచి ఆదరణ దక్కేది. కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేయడానికి మంచి అవకాశముండేది. కానీ ఇప్పుడు విడుదల చేసిన సమయానికి ప్రేక్షకుల మూడ్ పూర్తిగా వేరుగా ఉంది. ఇది ఖచ్చితంగా సినిమా ఫలితంపై ప్రభావం చూపించే అంశం. మొత్తానికి మజాకా కంటెంట్ పరంగా ఫర్వాలేదనిపించినా, టైమింగ్‌లో చేసిన పొరపాటు వల్ల మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాలు విడుదలలో టైమింగ్ ఎంత కీలకమో మరోసారి ఈ ఉదాహరణతో రుజువవుతోంది.

Tags:    
  • SundeepKishan 
  • RituVarma 
  • TrinadhaRaoNakkina 
  • LeonJames 
  • RazeshDanda 
  • Mazaka 
  • MazakaMovie 
  • Tollywood 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

స్టార్ హీరో బిగ్ మిస్టేక్.. అందుకే ర‌చ‌యిత‌లు అల‌క‌బూనారా?

2026-11-06 03:57 GMT

సౌత్ సినిమాలో చ‌రిత్ర సృష్టించిన‌ టాప్ -4 సౌండ్ ఇంజినీర్లు

2026-11-06 03:56 GMT

'రాప్తాడు ఘటన'కు సినిమాలను నిందించడం సరికాదు!

2026-11-06 03:55 GMT

నేను అంత అందంగా లేను.. ఈ స్వ‌చ్ఛ‌తే సీత పాత్ర‌కు ఔచిత్యం!

2026-11-06 03:53 GMT

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

Copyright @2026

Powered by Blink CMS