మతిస్థిమితం కోల్పోయి నటి రోడ్డుపై!
సుమీ హర్ చౌదరి ఈమె ఒక బెంగాలీ నటి. బుల్లి తెర సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలు కూడా చేసింది.;
సుమీ హర్ చౌదరి ఈమె ఒక బెంగాలీ నటి. బుల్లి తెర సీరియల్స్ తో పాటు కొన్ని సినిమాలు కూడా చేసింది. 'ద్వితియా పురుష్', 'కాశీ కథ: ఏ గోట్ సాగా' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకుంది. కొంత కాలంగా సుమీ నటనకు దూరంగా ఉంది. అయితే ఒక్కసారిగా ఆమె మంగళవారం రోడ్లపై తిరుగుతూ కనిపించడం అందర్నీ షాక్ కి గురి చేసింది. పశ్చిమ బెంగాల్ లోని పర్ప బార్దమాన్ జిల్లా అమిలా బజార్ లోని దిక్కు తోచని స్థితిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది.
హైవే పై కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కనే కూర్చుని చిత్తు కాగితాలపై ఏదో రాస్తూ కనిపించింది. తనలో తానే సగం బెంగాలీ, ఇంగ్లీష్ మాట్లాడుకుంటూ కనిపించింది. అక్కడే స్థానికులు గమనించి ఎవరు నువ్వు అని ఆరా తీయగా పేరు చెప్పింది. తొలుత ఆ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. కానీ గూగుల్ లో సెర్చ్ చేసి చూసే సరికి ఆమె ఫోటోలు రావడం...పేరు ఒకే లా ఉండటంతో అంతా షాక్ అయ్యారు.
అంత పెద్ద నటి ఇలా అయిందేంటని బాధపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అదించారు. అక్క డ నుంచి సుమీ మహిళా సంరక్షణా కేంద్రానికి తరలించారు. ఆమె కుటుంబ సభ్యులు ఎవరో కనుగొనే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు వైద్యు లను పిలిపించి వైద్యం అందిస్తున్నారు. మరి సుమీ ఇలాంటి పరిస్థితికి రావడానికి గల కారణాలు ఏంటి? అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్న కేసులు ఎక్కువవుతోన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా సాప్ట్ వేర్ ఇంజనీర్లు...సెలబ్రిటీలు..ధనవంతులే ఈ జాబితాలో కనిపిస్తున్నారు. రకరకాల కారణాలతో ఇలాంటి ఒత్తిళ్లకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.