మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరు నిలబడరు!
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.;
తెలుగమ్మాయి సుమయా రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. అనంతపురం నుంచి వచ్చిన ఆమె.. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునేందుకు డియర్ ఉమా మూవీతో సిద్ధమవుతున్నారు. ఆ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరికొద్ది గంటల్లో సినిమా రిలీజ్ కానుండగా.. ఇప్పటికే మూవీపై బజ్ క్రియేట్ అయ్యి ఉంది.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్, పోస్టర్స్ అన్నీ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే మేకర్స్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా.. సుమయా రెడ్డి మాట్లాడారు. తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
"రిజెక్షన్స్ అనేవి వెరీ కామన్.. మీకోసం మీరు నిలబడకపోతే మీకోసం ఎవరు నిలబడరు.. మీకు హెల్ప్ చేసే వారు ఉన్నారంటే అది మీరే.. అద్దం ముందు కూర్చోండి.. నిలబడండి.. మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోండి.. మనం ఫేస్ చేస్తున్నవి ఇంట్లో వాళ్లకు అన్నీ చెప్పుకోలేం... కేవలం ఫ్రెండ్స్ కు మాత్రం చెప్పుకోగలం" అంటూ సుమయా ఆవేదన వ్యక్తం చేశారు.
"నా లైఫ్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు సహాయం చేయడానికి అమెరికా నుంచి వచ్చారు. అయితే నా తలరాతను నేను మార్చుకోవాలని నిర్ణయించుకున్నా. మన సినిమా ఈవెంట్స్ కు సెలబ్రిటీలు వస్తే బాగుంటుంది. కానీ వాళ్లను ఎలా రప్పించాలో తెలియదు. సామాన్యుల కథతో మూవీ.. అందుకే సామాన్యంగా ఉండాలనుకున్నా" అని తెలిపారు.
"డియర్ ఉమా సినిమా చూడండి. ఒక తెలుగమ్మాయి ధైర్యం చేసి ఈ మూవీ తీసింది. తాను దాచుకున్న డబ్బులతో చేసింది. అన్నీ సినిమాలోనే ఉన్నాయి. మీ ప్రతి ఇంట్లో ఉమ ఉంటారు.. అందరూ ఉంటారు. తెలుగమ్మాయిను సపోర్ట్ చేయండి.. తెలుగు సినిమా చాలా కాలం పాటు బతికి ఉంటుంది. కంటెంట్ ఉందని పక్కాగా చెబుతాను" అని సుమయా రెడ్డి చెప్పారు.
అయితే రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అయింది. ఎయిర్ పోర్ట్ లో ఓ మాజీ ఎమ్మెల్యేతో ఉన్న ఆమె వీడియోపై సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేశారు. అప్పట్లో ఆమె రెస్పాండ్ అవ్వగా.. ఇప్పుడు మళ్లీ డియర్ ఉమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో అంత ఎమోషనల్ అవ్వడానికి కారణం ఆ వీడియో వ్యవహారమేనని అంతా అంటున్నారు.