రేపే విడుదల..హాలీవుడ్ మూవీకి తెలుగు డైరెక్టర్ రివ్యూ!

అయితే ఇప్పుడు ఏకంగా రేపు విడుదల కాబోతున్న ఒక హాలీవుడ్ చిత్రాన్ని ఈరోజు ఇండియాలో ప్రీమియర్ షో వేయగా.. ఆ హాలీవుడ్ మూవీకి తెలుగు డైరెక్టర్ రివ్యూ ఇచ్చారు..;

Update: 2025-12-18 12:18 GMT

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా విడుదలవుతోంది అంటే కచ్చితంగా విడుదలకు ముందు ఆ సినిమా ప్రీమియర్స్ వేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ప్రత్యేకించి కొంతమంది మీడియా మిత్రులకు, హీరోలకు, దర్శకులకు షోలు వేసి ఆ తర్వాత ఆ సినిమాపై వారి రివ్యూ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏకంగా రేపు విడుదల కాబోతున్న ఒక హాలీవుడ్ చిత్రాన్ని ఈరోజు ఇండియాలో ప్రీమియర్ షో వేయగా.. ఆ హాలీవుడ్ మూవీకి తెలుగు డైరెక్టర్ రివ్యూ ఇచ్చారు.. ప్రస్తుతం ఆయన ఇచ్చిన రివ్యూ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఏర్పడింది. ఆయన ఎవరో కాదు ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.

ఆర్య సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సుకుమార్ .. ఆ తర్వాత వరుస చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ తో పుష్పా సినిమా చేసి పాన్ ఇండియా డైరెక్టర్గా అవతరించారు. పుష్ప 2 సినిమాతో సంచలనం సృష్టించి.. స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్న సుకుమార్.. తాజాగా హాలీవుడ్ మూవీ అవతార్ 3 సినిమా స్పెషల్ షో చూసి సినిమా గురించి తన అభిప్రాయాన్ని రివ్యూ రూపంలో పెంచుకున్నారు.

ప్రముఖ హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రాలలో అవతార్ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దీని మూడో భాగం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. రేపు అనగా డిసెంబర్ 17న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ స్టోరీ గురించి సుకుమార్ మాట్లాడుతూ.. "3.17 గంటలు నాకు క్షణాల అయిపోయాయి. నేను పండోరా ప్రపంచానికి వెళ్ళిపోయాను. కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. తెలుగు సినిమాల్లో ఉండే ఎమోషన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా విజువల్స్ , పాత్రలు నా మైండ్ నుంచి ఇంకా వెళ్ళలేదు. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఇది థియేటర్లలోనే చూడాల్సిన సినిమా "అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఇకపోతే జేమ్స్ చిత్రాలను పేరు పెట్టడానికి ఎక్కడా లేదు. అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయన తన సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటారు. పైగా అవతార్ 3 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుండగా.. దీనికి తోడు టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ ఇవ్వడంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి. మరి ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

సుకుమార్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ తో ఇదివరకే రంగస్థలం సినిమా చేసిన ఈయన.. ఇప్పుడు తన శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా కోసం పనిచేస్తున్నారు..

అలాగే ఆ తర్వాత ఆయన రాంచరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు. రంగస్థలం సీక్వెల్ అంటూ వస్తున్న ఈ సినిమా మరో రికార్డ్ క్రియేట్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.



Tags:    

Similar News