సుకుమార్ కథ ఎన్ని గంటలు చెబుతాడో తెలుసా?
| గతంలో కథ చెప్పడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న దర్శకుడు సుకుమార్ ఇప్పుడు తన నెరేషన్ శైలిని మార్చుకున్నారట. నిమిషంలో కథ సారాంశం, 30 నిమిషాల్లో పూర్తి కథను వివరించేలా ప్రాక్టీస్ చేశారని సమాచారం. రామ్ చరణ్‌తో చేయబోయే సినిమా కోసం కథ, మేకింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గొప్ప విజయాలను సాధించిన దర్శకులు చాలామంది ఉన్నారు అందులో సుకుమార్ ఒకరు. ప్రస్తుతం ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. పాన్ ఇండియాలో ఆయన చేస్తున్న సినిమాలకు మంచి క్రేజ్ లభిస్తుంది. ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమా విషయంలో కూడా ఆయన ఆచితూచి అడుగుల ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎక్కడ కూడా కథ విషయంలో, మేకింగ్ విషయంలో రాజీపడని సుకుమార్ మరోసారి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు... ఒక సినిమా సెట్స్ మీదకి రావాలంటే దానికి హీరో దొరకాలి. అలాగే ఏ దర్శకుడైన ఎంత మంచి కథ రాసుకున్న దానిని పర్ఫెక్ట్ గా అవతలి వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. కొంతమంది దర్శకులు చెప్పిన కథలు హీరోలకు సరిగ్గా అర్థమవ్వకపోవడం వల్ల దాని వాల్యూ తెలియక వదిలేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందుకే మనం విజువల్ గా ఎలా చూపిస్తాం అనే విషయం పక్కన పెడితే కథ తో మొదట హీరో, ప్రొడ్యూసర్స్ ను మెప్పించాల్సిన అవసరమైతే ఉంది.
సుకుమార్ కి కథ చెప్పడం రాదా?
కెరియర్ స్టార్టింగ్ లో సుకుమార్ కథలు చెప్పడం లో చాలా వీక్ గా ఉండేవాడు. ఈ విషయాన్ని తనే చాలా సందర్భాల్లో ఓపెన్ గా చెప్పాడు. ఒకరోజు సుకుమార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కి కథ చెప్పాల్సి వచ్చింది. ఆరోజు కథను దాదాపు 3 గంటల పాటు చెప్పాడట. స్టోరీ మొత్తం విన్న విజయేంద్ర ప్రసాద్ సుకుమార్ తో కథ బాగా చెబుతున్నావ్ కానీ అంత సేపు చెబితే అందరికీ వినే ఓపిక ఉండకపోవచ్చని అన్నాడట. దాంతో సుకుమార్ కథ చెప్పే స్టైల్ ను మార్చుకున్నాడట. రీసెంట్ గా జగపతి బాబు సైతం ఒక ఇంటర్వ్యూ లో 'రంగస్థలం' మూవీ టాపిక్ వచ్చినప్పుడు సుకుమార్ ప్రెసిడెంట్ క్యారెక్టర్ గురించి చెబుతూ మధ్యలో తడబడ్డాడు. తన ఇబ్బంది అర్థం చేసుకున్న నేను ఆ పాత్ర చేస్తానని చెప్పాను అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుకుమార్ కథ ఎలా చెప్పిన దానిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేస్తాడని జగపతి బాబు చెప్పడం నిజంగా అందరిని ఆకట్టుకుంది.
ఇప్పుడు కథ పర్ఫెక్ట్ గా చెబుతాడా?
సుకుమార్ తక్కువ టైమ్ లో కథ చెప్పడానికి చాలా కసరత్తులు చేశాడట. ఇప్పుడు తను రాసుకున్న కథ ను వన్ మినిట్ లో చెబుతాడట, అలాగే 30 నిమిషాల్లో అర్థమయ్యేలా నేరెట్ చేస్తాడట... అవతలి వాళ్ళకి టైమ్ ఉండి 3 గంటల పూర్తి కథ చెప్పమన్న ఎక్కడ తడబడకుండా చాలా క్లారిటీ గా చెప్పి ఒప్పిస్తాడట. అలా తను రాసుకున్న కథను డిఫరెంట్ టైమింగ్స్ లో ఎలా చెప్పాలి అనే విషయం మీద తను చాలా రీసెర్చ్ చేసి తనకంటూ ఒక పర్ఫెక్ట్ గా ప్లాన్ ను డిజైన్ చేసుకున్నాడు. ఏ ఫిలిం మేకర్ అయిన ఒక కథను ఎంత తక్కువ టైమ్ ఇచ్చిన చెప్పగలగాలి... అప్పుడే వాళ్ళకి ఆ కథ మీద పూర్తి కమాండ్ ఉందని అవతలి వాళ్ళకి అర్థమవుతుంది. ఈ విషయంలో సుకుమార్ ఫుల్ క్లారిటీ తో ఉన్నాడు...