26 ఏళ్ల తర్వాత తమిళ్లో రీఎంట్రీ ఇస్తున్న రేణూదేశాయ్!
| 26 ఏళ్ల తర్వాత నటి రేణూ దేశాయ్ తమిళ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ధనుష్, సాయి పల్లవి, శ్రీలీల నటిస్తున్న ‘ఓం’ చిత్రంలో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. 2000లో ‘జేమ్స్ పాండు’తో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్‌లోనూ కనిపించారు. నవంబర్ 20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత నటిగా వెండితెరపై అలరించిన రేణూ దేశాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన 'జేమ్స్ పాండు' అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు రేణూ దేశాయ్. తమిళ్ కామెడీ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ చిత్రానికి సెల్వా దర్శకత్వం వహించగా ..సుందర్. వి నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత ఈమె మళ్లీ తమిళ్ చిత్రంలో నటించలేదు.
కానీ 26 ఏళ్ల తర్వాత మళ్లీ ఈమె తమిళ్ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారని తెలిసి.. అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె.. రవితేజ ప్రధాన పాత్రలో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాలో హేమలత లవణం పాత్రతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి తెరపై సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది.
అసలు విషయంలోకి వెళ్తే రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో.. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఓం. ఇందులో సాయి పల్లవి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. శ్రీ లీల ధనుష్ భార్యగా డి గ్లామరస్ పాత్ర పోషిస్తుంది. ఇక ఈ చిత్రం ద్వారానే రేణు దేశాయ్ తన రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. నవంబర్ 20వ తేదీన తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నవంబర్ 13వ తేదీన ఈ సినిమా తమిళ్ ట్రైలర్ ను విడుదల చేయగా.. నేడు తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇందులో సాయి పల్లవి తన యాక్షన్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఎప్పుడు క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలను ఎంచుకుంటూ అందరిని ఆకట్టుకున్న ఈమె.. తొలిసారి యాక్షన్ తో అదరగొట్టేసింది. ఇక ఈ ట్రైలర్ లో రేణూ దేశాయ్ ను కూడా చూపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా 26 ఏళ్ల తర్వాత మళ్లీ రేణు దేశాయ్ తమిళ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుండడంతో అటు అభిమానులు ఇటు సినీ ప్రియులు ఆమె స్క్రీన్ ప్రజెంట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఓం చిత్రంలో సాయి పల్లవి, శ్రీ లీల, ధనుష్ , మమ్ముట్టి నసీరుద్దీన్ షా వంటి భారీ తారాగణం భాగమైంది. ధనుష్ ఈ చిత్రంలో నటించడమే కాకుండా నిర్మిస్తున్నారు కూడా..
రేణూ దేశాయ్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. కృష్ణ దమ్మాలపాటి దర్శకత్వం వహించిన 16 రోజుల పండుగ అనే చిత్రంలో ఈమె నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు శరవేగంగా సాగుతోంది. అలాగే అత్తమామల సంబంధాల నేపథ్యంలో సాగే ఒక ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ లో కూడా ఈమె అత్త పాత్ర పోషించడానికి సైన్ చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా మళ్లీ వరుస అవకాశాలు అందుకుంటూ మునుపటి వైభవాన్ని అందుకోవాలని అభిమానులు, సినీప్రియులు ఆకాంక్షిస్తున్నారు.