సౌత్ ఇండస్ట్రీని రప్ఫాడించేస్తోన్న మహానటి!
| ‘మహానటి’తో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారారు. తెలుగులో ‘రౌడీ జనార్దన’, ‘జనవరి 12 విడుదల’, తమిళంలో ‘సత్యవాన్ సావిత్రి’, ‘కన్నివేడి’, మలయాళంలో ‘తోట్టం’, హిందీలో ‘రఫ్తార్’ చిత్రాల్లో నటిస్తున్నారు. పలు భాషల్లో విభిన్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌ను విస్తరించుకుంటున్నారు. అయితే ఇప్పటికీ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకోవాల్సి ఉంది.
`మహానటి` సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకుని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. కానీ ఆ తర్వాత అమ్మడి కెరీర్ ఆ రేంజ్ లో సాగలేదు. నియమనిబంధనలకు కట్టుబడి ఉండటంతో వచ్చిన అవకాశాలు వదు లుకుంది. దీంతో రేసులో వెనుకబడుతున్న విషయాన్ని గమనించిన కీర్తి గేర్ మార్చింది. అప్పటి నుంచి మళ్లీ అవకాశాలు పుంజుకున్నాయి. ఈ క్రమంలో హీరోయిన్ పాత్రకే పరిమితం కాకుండా స్టార్ హీరోల చిత్రాల్లోకీలక పాత్రలు సైతం పోషించింది. తాజాగా ఈ బ్యూటీ లైనప్ చూస్తే సౌత్ లో అన్ని భాషల్ని దున్నేస్తున్నట్లే కనిపిస్తోంది.
తెలుగు, తమిళం, మలయాళం ఇలా ప్రధాన భాషలన్నింటిలోనూ క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టారు.సినిమాలన్నీ సెట్స్‌పై ఉండటంతో కీర్తి సురేష్ కాల్షీట్స్ కోసం నిర్మాతలు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన `రౌడీ జనార్దన` వంటి పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ `జనవరి 12 విడుదల` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమలోనూ కీర్తి సురేష్ హవా ఏమాత్రం తగ్గ లేదు.
ప్రముఖ దర్శకుడు మిస్కిన్‌తో కలిసి నటించిన కోర్ట్ రూమ్ డ్రామా `సత్యవాన్ సావిత్రి` విడుదలకు సిద్దమవుతోంది. `కన్నివేడి` వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇటీవలే రిలీజ్ అయిన `డోరతీ` కీర్తి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ ఇమేజ్ కూడా తాజా లైనప్ లో ఉన్న చిత్రాలపై వర్కౌట్ అవుతుంది.మాతృభాష మలయాళంలోనూ కీర్తి సురేష్ సత్తా చాటుతున్నారు. మలయాళంలో `తోట్టం` వంటి విభిన్నమైన చిత్రంలో నటిస్తున్నారు.
అటు బాలీవుడ్‌లోనూ `రఫ్తార్` వంటి ప్రాజెక్ట్‌లతో పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌ను విస్తరించుకుంటున్నారు. ఇలా ఒకేసారి నాలుగైదు భాషల్లో భిన్నమైన జానర్లలో సినిమా షూటింగ్‌లతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. వీటిలో కొన్ని చిత్రాలు ఈ ఏడాది ముగింపుకల్లా రిలీజ్ అవుతున్నాయి. మిగిలిన చిత్రాలు వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇవి గనుక విజయం సాధిస్తే కీర్తి ఇమేజ్ ఆకాశాన్నంటుతుంది. ఓ దశలో అవకాశాలు లేక ఎంత ఖాళీగా ఉందో? ఇప్పుడు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంది. అయితే అమ్మడు ఇంకా పాన్ ఇండియా చిత్రాల్లో అవకాశాలు అందుకోవడంలో వెనుకబడే ఉంది. సీనియర్ గా ఓ గుర్తింపు ఉన్నా? పాన్ ఇండియా సినిమాలు మాత్రం రావడం లేదు.