• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పుడు రంగస్థలం, ఇప్పుడు...

అప్పుడు రంగస్థలం, ఇప్పుడు పుష్ప... సుకుమార్ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది...

| ‘ఆర్య’, ‘జగడం’తో విభిన్న కథలు తెరకెక్కించిన సుకుమార్.. ‘రంగస్థలం’, ‘పుష్ప’తో మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన సినిమాల్లోని కథలు, క్యారెక్టరైజేషన్లు, ట్విస్టులు కొత్త ట్రెండ్‌లకు కారణమవుతున్నాయని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, హీరో ఐడెంటిటీ వంటి అంశాలతో పలువురు దర్శకులు సినిమాలు తీస్తున్నారని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేస్తున్న RC17పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

By - Gopi Velupala
Update: 2026-11-14 11:30 GMT

'ఆర్య' మూవీతో ప్రేమలోని విభిన్న కోణాన్ని చూపించిన దర్శకుడు సుకుమార్... 'జగడం' మూవీతో రౌడీ అవ్వడం ఒక హీరోయిజంగా భావించే యూత్ మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది చాలా చక్కగా చూపించాడు. తెలుగులో ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. రంగస్థలం, పుష్ప సినిమాలతో మాస్ సినిమాలను సైతం సక్సెస్ ఫుల్ గా డీల్ చేసే కెపాసిటీ తనకుందని ప్రూవ్ చేశాడు...

సుకుమార్ ఎందుకంత స్పెషల్...

ఒకప్పుడు సుకుమార్ ప్రేక్షకుల మైండ్ కి పదునుపెట్టేలా సినిమాలు చేసేవాడు. ఆయన సినిమాలను చూసే ప్రేక్షకులు అందులోని పజిల్స్ ను సాల్వ్ చేయడానికి సినిమా పూర్తయ్యాక వాటి గురించి ఆలోచిస్తుండేవారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు పూర్తిగా క్యారెక్టర్ బేస్డ్ కథలను రాసుకుంటున్నాడు. ఆయన చేసిన 'రంగస్థలం' సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ అద్భుతంగా పేలడంతో అలాంటి తరహా సినిమాలను చేయడానికి చాలా మంది దర్శకులు ఆసక్తి చూపించారు. గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి చాలా మంది దర్శకులు అవే తరహా సినిమాలను చేస్తున్నారు. ఇక 'పుష్ప' సినిమాలో హీరో పుట్టుకలో తేడా ఉందని తనకి ఇంటి పేరు లేదంటూ హేళన చేసే మనుషుల మధ్య పెరిగిన పుష్ప తనకంటూ ఒక ఐడెంటిటి కావాలని ట్రై చేస్తుంటాడు. ఈ మూవీ పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసింది.

సుకుమార్ బాటలోనే నడుస్తున్నారా?

ఇప్పుడున్న చాలా మంది దర్శకులు మొన్నటిదాకా రంగస్థలం లాంటి రూరల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను చేశారు. ఇప్పుడు పుష్ప తరహాలో ఐడెంటిటి కథతో సినిమాలు చేస్తున్నారు. మొత్తానికైతే సుకుమార్ రాసుకున్న కథలు ఆయన చేసిన సినిమాలనే ఇండస్ట్రీ మొత్తం ఫాలో అవుతుంది. ఆయన ఏది చేస్తే అది ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. తన సినిమాలు వచ్చిన కొద్ది సంవత్సరాల పాటు అలాంటి తరహా సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా సైతం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం పక్కా అంటూ సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి...

లెక్కల మాస్టర్ లెక్కేంటి?

సుకుమార్ కి సినిమాల మీద ఎంత పిచ్చి ఉంటుందంటే ఒక సినిమా కథ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి ఆయన 10 వెర్షన్స్ రాసుకుంటారట. అందులో ఏది బెస్ట్ అనిపిస్తే దానిని తెరమీదకి తీసుకువస్తారు. అందుకే సుకుమార్ సినిమాల్లో కథ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా లాజికల్ గా డిజైన్ చేస్తుంటాడు. ఎమోషన్స్ ను హైలెట్ చేసి చూపిస్తాడు. ఏ హీరో ను ఎలా చూపించాలో ఆయనకి బాగా తెలుసు. అందుకే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలందరు అతనితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు...

Tags:    
  • sukumar 
  • pushpa 
  • rangasthalam 
  • aryamovie 
  • tollywood 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS