పిక్ ఆఫ్ ది డే.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు దిగ్గజాలు!
ఈ మధ్యనే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ సుజీత్ తాజాగా సచిన్ టెండుల్కర్ తో కలిసి వర్క్ చేసారు.దానికి సంబంధించిన తాజా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.;
ఈ మధ్యనే ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ సుజీత్ తాజాగా సచిన్ టెండుల్కర్ తో కలిసి వర్క్ చేసారు.దానికి సంబంధించిన తాజా ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. దర్శకుడు సుజీత్ క్రికెట్ లెజెండ్ అయినటువంటి సచిన్ టెండూల్కర్ తో కలిసి ఒక కొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటన కోసం పని చేసారు. ఈ ప్రకటన ఈ వారం ప్రారంభంలో విదేశాలలో చిత్రీకరించారు. అయితే తాజాగా సెట్స్ నుండి సచిన్ టెండూల్కర్ దర్శకుడు సుజీత్ ఇద్దరు కలిసి మాట్లాడకున్న ఒక ఫోటో వైరల్ అవుతుంది. వీరిద్దరూ ఆ ఫోటోలో ఏదో విషయం గురించి మాట్లాడుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఈ ఫోటోలో డైరెక్టర్ సుజీత్ దిశా నిర్దేశం చేస్తుండగా.. సచిన్ టెండుల్కర్ చాలా ఉత్సాహంగా ఆయన చెప్పే విషయాన్ని వింటున్నట్టు కనిపించారు. అయితే ఈ వాణిజ్య ప్రకటన ఒక విమానంలో షూట్ చేసినట్టు అర్థమవుతుంది.. అలా క్రికెట్ మరియు సినిమా రెండు విభిన్న ప్రపంచాల నుండి వచ్చిన ఇద్దరు ప్రముఖులను ఒకే చోట చూడడం ప్రస్తుతం సోషల్ మీడియా జనాల దృష్టిని ఆకర్షించింది. దాంతో ఈ ఫోటో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.ఈ ఫోటో చూసిన చాలామంది నెటిజన్లు ఇద్దరు దిగ్గజాలను ఒకే చోట చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.. వీరిద్దరూ కలిసి పనిచేయడం సినీ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని సృష్టించింది. ఇక సుజీత్ డైరెక్షన్లో సచిన్ టెండూల్కర్ చేసిన ఆ యాడ్ ఏంటంటే టెక్నో పెయింట్స్ యాడ్.. గురువారం రోజు సచిన్ టెండూల్కర్ తో సుజీత్ ఈ యాడ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.
అలాగే సుజీత్ డైరెక్షన్ లో సచిన్ చేసిన ఈ రెండు ప్రకటనలని త్వరలోనే ప్రసారం చేయబోతున్నాం అంటూ టెక్నో పెయింట్స్ చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. సచిన్ టెండూల్కర్ విషయానికి వస్తే..ఈయన క్రికెట్ కి గుడ్ బై చెప్పిన దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఎన్నో బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. అలా ఇప్పటికే సచిన్ టెండుల్కర్ బూస్ట్, పెప్సీ వంటి కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
డైరెక్టర్ సుజీత్ విషయానికి వస్తే.. రన్ రాజా రన్ మూవీ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన ఆ తర్వాత సాహో మూవీతో ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ తీశారు.ఈ మూవీ మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుజీత్ కి భారీ క్రేజ్ లభించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి దే కాల్ హిమ్ ఓజి అనే మూవీ తో ఈ మధ్యనే మన ముందుకు వచ్చారు. ఈ మూవీ హిట్ అవ్వడంతో సుజీత్ కి దేశవ్యాప్తంగా మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం ఈయన నానితో కలిసి బ్లడీ రోమియో అనే సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ మూవీ షూటింగ్ పూర్తవ్వడంతోనే బ్లడీ రోమియో సెట్స్ లో పాల్గొనబోతున్నారు.