• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OG కి పవన్ నాట్ ఓకే..?

OG కి పవన్ నాట్ ఓకే..?

| డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

By - Tupaki Desk
Update: 2025-01-26 01:30 GMT

రన్ రాజా రన్ తో తొలి సినిమానే సక్సెస్ అందుకుని సెకండ్ ప్రాజెక్టే రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు డైరెక్టర్ సుజిత్. ఆ సినిమా తర్వాత ఒకటి రెండు భారీ అవకాశాలే వచ్చినా చేయలేదు. ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు సుజిత్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ డైరెక్షన్ లో పవర్ స్టార్ మార్క్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఓజీ వస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కేలా చేసింది. జస్ట్ గ్లింప్స్ తోనే కిరాక్ అనిపించిన థమన్ సినిమాతో రచ్చ చేసేలా ఉన్నాడని అనిపిస్తుంది. అందుకే ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ మాత్రం సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

ఐతే ఈమధ్య స్టార్ సినిమాలన్నీ కూడా రెండు భాగాలుగా వస్తున్నాయి. ఓజీపై ఉన్న అంచనాలు చూస్తే ఈ సినిమాను కూడా రెండు భాగాలు చేసినా చేస్తారని అనుకుంటున్నారు. ఐతే ఓజీని రెండు భాగాలు చేయాలని డైరెక్టర్, ప్రొడ్యూసర్ అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు నో చెబుతున్నాడని టాక్. ఇప్పటికే కమిటైన సినిమాల విషయంలో పవన్ కళ్యణ్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు రెండు భాగాలు అంటే మరి కొన్నాళ్లు పనిచేయాల్సి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ కి ఆ ఇంట్రెస్ట్ లేదన్నట్టు తెలుస్తుంది. ఓజీతో పాటు నాలుగేళ్ల క్రితం మొదలైన హరి హర వీరమల్లు సినిమా మాత్రం రెండు భాగాలుగా వస్తుంది. వీరమల్లు, ఓజీ రెండు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పని చూడాల్సి ఉంటుంది. ఓజీ తో పాన్ ఇండియా లెవెల్ లో పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. వీరమల్లు సినిమా మార్చ్ ఎండింగ్ కి ప్లాన్ చేస్తుండగా ఓజీ ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

Tags:    
  • Sujeeth 
  • Pawankalyan 
  • OGmovie 
  • OG 
  • Thamanmusic 
  • Thaman 
  • Powerstar 
  • Actionentertainer 
  • DvvEntertainment 
  • Twopartmovie 
  • Fansexcitement 
  • HariHaraVeeramallu 
  • UstaadBhagatSingh 
  • Filmupdates 
  • Movierelease 
  • Stylishactionfilm 

Similar News

'వార‌ణాసి' త‌ర్వాత ప్రియాంక చోప్రా టాలీవుడ్‌కి బైబై

2026-11-11 01:46 GMT

బాలకృష్ణ అంటే భయపడ్డా.. ఆయన మంచితనం చూసి షాకయ్యా: సీనియర్ హీరోయిన్ సంఘవి

2026-11-11 01:45 GMT

రాజమౌళిని తిడతారా.. వారణాసిని ఆపుతారా?: ప్రకాష్ రాజ్ కామెంట్స్

2026-11-11 01:45 GMT

మాయ లేడీ సెన్సార్.. క్రేజీ క్రేజీగా హీరో గారి వేషాలు

2026-11-11 01:42 GMT

`కాకా` మీద చ‌ర‌ణ్‌కి మ‌రీ అంత న‌మ్మ‌క‌మేంటో?

2026-11-11 01:41 GMT

ఆ స్టార్ కోసం ఆగిపోయిన కథ.. మళ్ళీ రాస్తాడట

2026-11-11 01:41 GMT

ఔను..వాళ్లిద్దరూ కూడా విడిపోతున్నారంట..!

2026-11-11 01:41 GMT

చిరు మాట ఇచ్చారు సరే.. వెంకీకి మళ్ళీ మెగా ఛాన్స్ దక్కేనా?

2026-11-10 18:30 GMT

ISKCON వ్యవస్థాపక ఆచార్యులు శ్రీ‌ల ప్ర‌భుపాద్‌ బ‌యోపిక్..హోంబలే సంచలనం!

2026-11-10 17:30 GMT

తమిళ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాకు ఎలివేషన్

2026-11-10 16:30 GMT

డైరెక్టర్ టు హీరో.. భాషతోపాటు క్యారెక్టర్ మార్చిన తరుణ్ భాస్కర్.. వర్కౌట్ అయ్యేనా?

2026-11-10 15:30 GMT

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS