చిన్న కొడుకు రాకతో.. అంబరాన్నంటిన దీపావళి సంబరాలు..
ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ హీరో సుహాస్ కూడా తన ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు హీరో సుహాస్.;
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఘనంగా దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలు కూడా ఇలా దీపావళి సెలబ్రేషన్స్ ను కుటుంబంతో కలిసి జరుపుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ టాలీవుడ్ హీరో సుహాస్ కూడా తన ఇంట్లో దీపావళి వేడుకలు జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు హీరో సుహాస్.
తాజాగా చిన్న కొడుకు రాకతో సుహాస్ సంబరాలు అంబరాన్ని అందినట్లు అనిపిస్తోంది. పట్టు వస్త్రాలలో భార్యాభర్త, పిల్లలు కనిపించి పరిపూర్ణ ఫ్యామిలీగా అందరిని ఆకట్టుకున్నారు ఇక తాజాగా సుహాస్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ క్యూట్ ఫ్యామిలీకి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీపావళి మొత్తం మీ ఇంట్లోనే ఉంది అంటూ సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సుహాస్ తన ఇద్దరు కొడుకులు, భార్యతో కలిసి దీపావళి వేడుకల్లో నిమగ్నమయ్యారని చెప్పవచ్చు.
దీపావళి సందర్భంగా సుహాస్ షేర్ చేసిన ఈ ఫోటోలలో ఇద్దరు కుమారులతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు ఇందులో సుహాస్ భార్య లలిత గోల్డెన్ కలర్ పట్టు చీరలో మెరుస్తూ చాలా సంతోషంగా కనిపించింది. మంచి వైబ్స్, పండుగ వాతావరణం ఉట్టిపడేలా ఈ జంట అభిమానులతో ఫోటోలు పంచుకున్నారు. ఇకపోతే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దీపావళి పండుగ సందర్భంగా తమ చిన్న కొడుకుకి బారసాల కూడా చేసినట్లు తెలుస్తోంది.
కలర్ ఫొటో సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ఆ తర్వాత పలు చిత్రాలలో హీరోగా, ఇంకొన్ని చిత్రాలలో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు కూడా పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే హిందీ చిత్రం జాట్ లో కనిపించిన ఈయన ఇటు కీర్తి సురేష్ తో ఉప్పుకప్పురంబు సినిమాలో కూడా నటించి తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అంతేకాదు ఓజీలో గెస్ట్ పాత్ర కూడా పోషించారు సుహాస్.
ప్రస్తుతం కేబుల్ రెడ్డి, ఆనంద్ రావు అడ్వెంచర్స్ చిత్రాలతో పాటు మందాడి అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో బిజీగా గడిపేస్తున్న సుహాస్ తన సమయాన్ని కుటుంబం కోసం కూడా కేటాయించడంతో ఈయనకు కుటుంబం పట్ల ఉన్న నిబద్ధత స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సుహాస్ కెరియర్ విషయానికి వస్తే.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి.. 2018లో పడిపడి లేచేమనసు సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత మజిలీ, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే , ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించి.. కలర్ ఫోటోతో హీరోగా అడుగు పెట్టారు. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం కూడా లభించింది