• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సుధీర్ బాబు.. హై వోల్టేజ్...

సుధీర్ బాబు.. హై వోల్టేజ్ ఫిట్నెస్

| యంగ్ హీరో సుధీర్ బాబు యాక్టర్ గా మంచి టాలెంటెడ్ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు

By - Tupaki Desk
Update: 2024-07-21 08:11 GMT

యంగ్ హీరో సుధీర్ బాబు యాక్టర్ గా మంచి టాలెంటెడ్ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. అయితే కెరియర్ పరంగా చూసుకుంటే ఆశించిన స్థాయిలో సక్సెస్ లు లేవు. సూపర్ స్టార్ మహేష్ బాబు బామ్మర్ది అనే బ్రాండ్ తోనే టాలీవుడ్ లోకి సుధీర్ బాబు ఎంట్రీ ఇచ్చాడు. అయితే నటుడిగా తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేసుకున్నాడు. కండలు తిరిగిన శరీరంతో అదిరిపోయే లుక్ లో కనిపించే సుధీర్ బాబుకి తనని తాను పూర్తిస్థాయిలో షోకేస్ చేసుకునే క్యారెక్టర్ పడలేదని ఆయనని ఫాలో అయ్యేవారు అంటారు.

అయితే కెరియర్ ఆరంభం నుంచి డిఫరెంట్ కథలని ట్రై చేస్తూ ఉండటం వలన సుధీర్ బాబుకి కమర్షియల్ గా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ పడలేదు. రీసెంట్ గా హరోంహర సినిమాతో సుధీర్ బాబు ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. ఓటీటీలో ఈ చిత్రాన్ని ఎక్కువ మంది ఆడియన్స్ చూస్తున్నారు. పీరియాడిక్ జోనర్ లో పవర్ ఫుల్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం చేశారు. సుదీర్ బాబు పెర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది.

కమర్షియల్ గా థియేటర్స్ లో ఈ మూవీ సక్సెస్ అందుకోలేదు. ఇదిలా ఉంటే సుధీర్ బాబు తన నెక్స్ట్ మూవీని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా చేయబోతున్నాడు. అది కూడా కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం సుధీర్ బాబు జిమ్ లో కసరత్తులు చేస్తున్నారంట. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోందంట. ఇందులో సుధీర్ బాబు క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో క్యారెక్టర్ పెర్ఫెక్షన్ కోసం లుక్ పరంగా వేరియేషన్ చూపించే ప్రయత్నం సుధీర్ బాబు చేస్తున్నారు. అసలే కండలు తిరిగిన శరీరంతో సుధీర్ బాబు ఉంటాడు. ఇప్పుడు ఆ కండలు మరింతగా పెంచి ఫైటర్ తరహాలో సిద్ధం అవుతూ ఉండటం ఆసక్తికరంగా మారింది. వర్క్ అవుట్ కి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ప్రేరణ అరోరా ఈ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు.

వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ మూవీలో పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయంట. పౌరాణిక కథల రిఫరెన్స్ తోనే ఈ చిత్రాన్ని వెంకట్ కళ్యాణ్ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధంగా ఈ మూవీ కథాంశం ఉంటుందంట. త్వరలో మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ ని సుధీర్ బాబుకి జోడీగా ఈ చిత్రం కోసం ఎంపిక చేయబోతున్నారంట.

Tags:    
  • Sudheerbabu 
  • Sudheerrippedlook 
  • Tollywood 
  • Haromhara 
  • Maheshbabu 
  • Sudheerbabufitness 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS