• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరోటి రెడీ చేసిన బాబు.....

మరోటి రెడీ చేసిన బాబు.. దసరాకి ఫిక్స్‌!

| సూపర్‌ స్టార్ కృష్ణ ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీర్ బాబు తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు.

By - Tupaki Desk
Update: 2024-08-27 09:50 GMT

సూపర్‌ స్టార్ కృష్ణ ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీర్ బాబు తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేశాడు. సక్సెస్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ నటుడిగా ప్రతి సినిమాకు మంచి పేరును సొంతం చేసుకున్నాడు. ఈ మధ్య కాలంలో సుధీర్ బాబు నటించిన సినిమాలు కమర్షియల్‌ గా నిరాశ పర్చుతూ వచ్చాయి. అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిని కనబర్చుతూనే ఉన్నారు. తాజాగా మరో సినిమాతో సుధీర్ బాబు రెడీ అయ్యాడు.

కొన్ని నెలల క్రితం హరోం హర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు ఇప్పుడు మా నాన్న సూపర్‌ హీరో అనే విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. హరోమ్‌ హర సినిమా కోసం సుధీర్ బాబు చాలా కష్టపడ్డాడు. ఆ సినిమా విడుదల సమయంలో సుధీర్ బాబు చాలా నమ్మకంగా కనిపించాడు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదని ప్రేక్షకుల తిరస్కరణకు గురి అయ్యింది. ఇప్పుడు మా నాన్న సూపర్ హీరో అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా కి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. లూజర్‌ వెబ్‌ సిరీస్ తో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్న ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. దసరాకు చిన్నా పెద్ద సినిమాలతో చాలానే ఉంటాయని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని సినిమాలు తప్పుకోవడం వల్ల దసరా సీజన్‌ కాస్త ఫ్రీ సీజన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

దసరా కి వస్తే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది అనే ఉద్దేశ్యంతో సుధీర్‌ బాబుతో పాటు మేకర్స్ భావించి విడుదలకు ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాలో సుధీర్‌ బాబు కు జోడీగా ఆర్నా హీరోయిన్‌ గా నటించింది. సీఏఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ తో కలిసి వి సెల్యూలాయిడ్స్ బ్యానర్‌ లో సునీల్‌ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆకట్టుకునే తండ్రి కొడుకుల సెంటిమెంట్‌ తో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా ఉండటంతో పాటు, సుధీర్ బాబు మార్క్ యాక్షన్ ఉంటుందని దర్శకుడు అభిలాష్ అన్నారు.

Tags:    
  • Sudheerbabu 
  • MNSH 
  • Tollywood 
  • Filmindustry 
  • Dussehra 
  • Abhilashreddy 
  • Haromhara 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS