మహేష్ ను అలా పిలవాలంటే సిగ్గేస్తుంది
ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సుధీర్ ఎప్పుడూ దాన్ని వాడుకుని అవకాశాలు అందుకోవడానికి ట్రై చేయలేదు.;
ఇండస్ట్రీలో ఎవరైనా సరే బ్యాక్ గ్రౌండ్ ద్వారా వస్తే వారికి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగని టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో కంటిన్యూ అవలేరు. ఆ టాలెంటే వారు ఇండస్ట్రీలో ఎన్ని రోజులు కంటిన్యూ అవుతారనేది డిసైడ్ చేస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలోకి ఎంతోమంది బ్యాక్ గ్రౌండ్ ద్వారా వచ్చి సక్సెస్ అవగా, మరికొందరు ఇప్పటికీ నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ
ఘట్టమనేని కృష్ణ కు అల్లుడిగా, మహేష్ బాబుకు బావగా సుధీర్ బాబు కూడా అలానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కృష్ణను, మహేష్ ను వాడుకుని ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తర్వాత మాత్రం సుధీర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించారు. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ సుధీర్ ఎప్పుడూ దాన్ని వాడుకుని అవకాశాలు అందుకోవడానికి ట్రై చేయలేదు. సొంతంగానే ఛాన్సులు అందుకుని వాటితో కెరీర్లో ముందుకు వెళ్లాలని అనుకున్నారు.
నవంబర్ 7న జటాధర రిలీజ్
సుధీర్ బాబు హీరో అవకముందే మహేష్ బాబు చెల్లెలిని పెళ్లి చేసుకున్నారు. వరసకి సుధీర్ బాబు, మహేష్.. బావా బామ్మర్ది అవుతారు. అయినా సరే మహేష్ ను తానెప్పుడూ బావ అని పిలిచింది లేదని చెప్తున్నారు సుధీర్ బాబు. ఆయన నటించిన తాజా సినిమా జటాధర నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో సుధీర్ యాక్టివ్ గా పాల్గొంటున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ బాబుకు మహేష్ కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మహేష్ ను మీరు బావ అనే పిలుస్తారా లేదా ఇంకేమైనా పిలుస్తారా అని అడగ్గా, దానికి సుధీర్ బాబు సమాధానమిచ్చారు. తాను మహేష్ అనే పిలుస్తానని, ఇప్పటివరకు అసలు బావ అని పిలవనే లేదని, బావ బామ్మర్ది అని పిలిస్తే బావుంటుందని తనకు అనిపించినప్పటికీ అలా పిలవాలంటే సిగ్గేస్తుందని, కానీ ఎప్పుడైనా మహేష్ ను బావ అని పిలిస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలనుందని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు.