కూలీ, వార్ 2 చిత్రాలను కూడా వెనక్కి నెట్టిన చిన్న సినిమా.. ఇది కదా సక్సెస్ అంటే!
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా మోజులో పడి మంచి కథలను తెరకెక్కించడమే మర్చిపోయారు.;
ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా మోజులో పడి మంచి కథలను తెరకెక్కించడమే మర్చిపోయారు. ఎప్పుడు భారీ భారీ సెట్లు,భారీ తారాగణం,పెద్ద పెద్ద హీరోలు,హై రేంజ్ లో ఉండే గ్రాఫిక్స్,విజువల్స్ వంటి వాటిని మాత్రమే చూపించడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్లో విడుదల అవ్వడంతో కథ బలంగా లేకున్నా కూడా చాలామంది దర్శక నిర్మాతలు పాన్ ఇండియా అంటూ ప్రకటిస్తున్నారు. కానీ తీరా సినిమా థియేటర్ కి వెళ్లి చూశాక అందులో కథ ఉండదు ఏం ఉండదు.దాంతో వందల కోట్ల బడ్జెట్లు పెట్టి తెరకెక్కించిన సినిమాలు డిజాస్టర్స్ గా నిలిచి నిర్మాతలకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. కానీ చిన్న సినిమాలు మాత్రం అనుకోకుండా హిట్స్ అవుతున్నాయి. అలా తాజాగా విడుదలైన ఓ సినిమా కూలీ,వార్-2 వంటి సినిమాలను కూడా పక్కకు నెట్టేసింది. మరి ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సు ఫ్రమ్ సో..
సు ఫ్రమ్ సో..కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ లో విడుదలై టాలీవుడ్ లో కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఆగస్టు 8న విడుదలైన సు ఫ్రమ్ సో అనే సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా పెద్ద సినిమాలను సైతం పక్కకు నెట్టేస్తోంది. హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కిన సు ఫ్రమ్ సో సినిమా కన్నడలో కేవలం రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఇప్పటికే రూ.35 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అది కూడా కేవలం కన్నడలోనే..
వార్ 2, కూలీ సినిమాలను వెనక్కి నెట్టిన సు ఫ్రమ్ సో..
అలా కన్నడలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిన ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసి మంచి లాభాలు అందుకుంటున్నారు. ఈ సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా కూడా హౌస్ ఫుల్ బోర్డులతో థియేటర్లన్నీ కళకళలాడిపోతున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2, రజినీకాంత్, నాగార్జున కాంబోలో వచ్చిన కూలీ ఈ రెండు పాన్ ఇండియా సినిమాల ను కూడా సు ఫ్రమ్ సో మూవీ పక్కకు నెట్టింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు భారీ పాన్ ఇండియా సినిమాల ముందు ఈ చిన్న సినిమా తట్టుకోవడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు..
సు ఫ్రమ్ సో సినిమా విశేషాలు..
సు ఫ్రమ్ సో సినిమా విషయానికి వస్తే.. జెపి తుమినాడ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో జెపి తుమినాడ్, షనీల్ గౌతమ్, రాజ్ బి శెట్టి, ప్రకాష్ తుమినాడ్, సంధ్య అరకెరె లు కీలక పాత్రల్లో నటించారు.అలాగే ఈ సినిమాని కన్నడలో శశిధర్ శెట్టి బరోడా, రవి రాయ్ కైలాస, రాజ్.బి. శెట్టి లు నిర్మించగా తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసారు... అలా చిన్న సినిమాగా వచ్చి బలమైన మౌత్ టాక్ తో అతిపెద్ద హిట్ అయింది. ఇక దీన్ని బట్టి చూస్తే ఇది కదా అసలైన సక్సెస్ అంటే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.