గుట్కా యాడ్‌పై ప్రశ్నించిన జర్నలిస్టును తిట్టేసిన హీరో
సెలబ్రిటీలు కొన్నిసార్లు జర్నలిస్టుల నుంచి వివాదాస్పద ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.;
సెలబ్రిటీలు కొన్నిసార్లు జర్నలిస్టుల నుంచి వివాదాస్పద ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిజానికి మీడియా సమావేశాల్లో అందరు జర్నలిస్టులూ ఒకేలా ఉండరు. కొందరు వివాదాలపై ప్రశ్నించేందుకు వెనకాడరు. ఇప్పుడు ఓ ఇంటరాక్షన్‌లో ప్రముఖ జర్నలిస్టు స్టార్ హీరోని గుట్కా ప్రకటన విషయమై నిలదీసాడని గుసగుస వినిపిస్తోంది.
అయితే సమావేశంలో ఏమాత్రం ఆవేశం ప్రదర్శించని సదరు స్టార్ హీరో, ఆ తర్వాత విడిగా పిలిచి ఆ జర్నలిస్టు మైండ్ ను శుద్ధి చేసాడట. సమావేశాల్లో అలా ప్రశ్నించకూడదు.. కేవలం సినిమా గురించి మాత్రమే ప్రశ్నించాలి అంటూ సదరు స్టార్ హీరో వార్నింగ్ ఇచ్చాడు. కటువుగా మాట్లాడకపోయినా అతడు తనలో దాగి ఉన్న మరో కోణాన్ని చూపించాడట.
నిజానికి అంత పెద్ద స్టార్ హీరో గుట్కా ప్రకటనలో నటించడంపై చాలా విమర్శలు వచ్చాయి. ప్రజారోగ్యాన్ని కాపాడే బాధ్యతాయుతమైన పనులు చేయాలి కానీ, క్యాన్సర్ కారకమైన పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో నటిస్తారా? అంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ ప్రకటన వ్యవహారం పెద్ద చర్చగా మారింది. స్టార్ హీరోలపై కొందరు కేసులు కూడా ఫైల్ చేసారు. కోర్టుల్లో విచారణ కూడా జరిగింది. ఇప్పటికీ గుట్కా ప్రకటనలో నటించిన పెద్ద హీరోలంతా ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఆసక్తికరంగా తాజా మీడియా సమావేశంలో సదరు స్టార్ హీరో పొగాకు ప్రమాదకరం, క్యాన్సర్ కారకం! అని కూడా అంగీకరించాడు. కానీ తనను అందరి ముందు ప్రశ్నించిన జర్నలిస్టుపై స్టార్ హీరో కోపాన్ని దాచుకోలేకపోయాడు. ఒకానొక సమయంలో ``ఇది నా ఇంటర్వ్యూనా? మీ ఇంటర్వ్యూనా?`` అని విలేకరిని స్టార్ హీరో ప్రశ్నించాడు. దీనిని బట్టి గుట్కా యాడ్ తనను ఎంతగా డిస్ట్రబ్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.