కెరీర్ చరమాంకంలో ఇస్మార్ట్ బ్యూటీ!
నభా నటేష్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో వెలుగులోకి వచ్చింది.;
నభా నటేష్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. `నన్ను దోచుకుందువటే` చిత్రంతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో వెలుగులోకి వచ్చింది. పూరి మేకింగ్ లో అమ్మడు ప్రత్యకంగా హైలైట్ అయింది. నటిగా నభాకు ఓ ఐడెంటిటీ దక్కింది. కానీ ఏం లాభం ఆ సక్సస్ ని మాత్రం కొనసాగించ లేకపోయింది. ఆ తర్వాత నటించిన `డిస్కోరాజా` ,` సోలో బ్రతుకే సో బెటర్`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో`లాంటి చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో నభా టాలీవుడ్ లో ఏకంగా మూడేళ్ల పాటు కనిపించడం మానేసింది.
శక్తివంతమైన పాత్రలో:
మళ్లీ 2024 లో `డార్లింగ్` సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా కూడా ప్లాప్ అయింది. ఇలా ఇన్నిప్లాప్ లు చూసిన బ్యూటీకి తెలుగులో మరో అవకాశం అంటే జరిగే పని కాదని అంతా డిసైడ్ అయ్యారు. కానీ అప్పుడే ఓ పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ అందుకుని సర్ ప్రైజ్ చేసింది. నిఖిల్ హీరోగా `స్వయంభూ` చిత్రం తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఓ హీరోయిన్ గా నభా నటేష్ ని దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో అమ్మడు ఓ శక్తివంతమైన పాత్రలో నే కనిపించనుంది. హీరోకు ధీటుగా ఆ రోల్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది.
లక్కీ హీరోయిన్ గా ఆ బ్యూటీ:
గుర్రపు స్వారీలు..యుద్ద సన్నివేశాల్లో నభా నటేష్ కనిపించనుంది. ఆ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంది. కెరీర్ చరమాంకంలో నభా నటేష్ కి వచ్చిన ఓ గొప్ప అవకాశంగానే ఈ చిత్రాన్ని చెప్పాలి. ఇలాంటి సినిమాల్లో భాగమవ్వాలని ఎంతో మంది నటీమణులు ఆశపడుతుంటారు. డ్రీమ్ రొల్స్ అన్నవి ఇలాంటి కథలకే ఆస్కారం ఉంటుంది. కాబట్టి యువరాణి పాత్రలన్నవి ఇలాంటి సినిమాలతోనే సాధ్యమవుతుంటాయి. అలాంటి పాత్రలో నభానటేష్ ఛాన్స్ అందుకోవడంతో అదృష్టవంతురాలేనే చెప్పాలి.
రెండు భాషలకే పరిమితమైన నటి:
అదెలా ఉన్నా? సినిమా సక్సస్ మాత్రమే నభా నటేష్ కెరీర్ డిసైడ్ చేసేది. ఇప్పటికే చాలా ఛాన్సులొచ్చాయి. కానీ ఇదే చివరి ఛాన్స్. అదీ ఏడాది గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఈ సినిమా విజయం సాధిస్తే నభా నటిగా మళ్లీ బిజీ అవుతుంది. కొత్త అవకాశాలకు అవకాశం ఉంటుంది. ఇతర భాషలకు కూడా ప్రమోట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పాన్ ఇండియాలో ఓ గుర్తింపు దక్కుతుంది. నభా నటేష్ కేవలం తెలుగు, కన్నడ చిత్రాలు తప్ప మరే భాషల్లోనూ పని చేయలేదు. `స్వయంభూ` సక్సెస్ తో అన్ని భాషల్లోనూ బిజీ అవ్వాలని ఆశీద్దాం.