హిట్ ఇచ్చినా వాళ్లిక కిందకు దిగాల్సిందే!
స్టార్ డైరెక్టర్లు అంతా స్టార్ హీరోలతోనే పనిచేయాలనుకుంటారు. కొంత మంది డైరెక్టర్లు కొంత మంది హీరోలకే ఫిక్సై పోతారు.;
స్టార్ డైరెక్టర్లు అంతా స్టార్ హీరోలతోనే పనిచేయాలనుకుంటారు. కొంత మంది డైరెక్టర్లు కొంత మంది హీరోలకే ఫిక్సై పోతారు. వాళ్లు ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడే పనిచేయాలని ఎదురు చూస్తుంటారు. అందుకోసం ఏడాది రెండేళ్ల పాటు ఎదురు చూస్తుంటారు. కానీ ఇప్పుడలా ఎదురు చూస్తే సమయం వృద్ధా తప్ప సాధించేది ఏం లేదు. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా కంటెంట్ వైపు చూడటంతోనే ఈ సమస్య తలెత్తింది. ఒక్కో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేయడానికి రెండేళ్‌లు..మూడేళ్‌లు పడుతుంది.
ఇంకా అవసరం అనుకుంటే మరో ఏడాది అదనంగా పెట్టడానికే ఛాన్స్ ఉంది తప్ప తగ్గడానికైతే లేదు. డే బైడే సెట్స్ లో వర్కింగ్ డేస్ పెరిగిపోవడంతో షూటింగ్ కూడా డిలే అవుతుంది. షూటింగ్ అంతా ఒక ఎత్తైతే అటు పై పోస్ట్ ప్రొడక్షన్ కు నెలలు సమం పడుతుంది. అటుపై సినిమా ప్రచారంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు తిరగడం...రిలీజ్ హడావుడి అంతా బిజీగా మారిపోయింది. ఈ మధ్యలో ఏదో సమయంలో గతంలో హిట్ ఇచ్చిన డైరెక్టర్లు స్టోరీ ఒకే చేయించుకుని ఎదురు చూస్తు న్నారు.
వాళ్ల స్టోరీ కంటే ఇంకా మంచి స్క్రిప్ట్ కుదిరితే ముందొచ్చిన వాళ్లను వెనక్కి నెట్టి మరీ హీరోలు కొత్త వాళ్లతో ముందుకెళ్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ త్రివిక్రమ్. బన్నీ 22 చిత్రం త్రివిక్రమ్ దే కావాలి. కానీ ఏం జరిగింది. వాళ్లిద్దరి మధ్యలో అట్లీ దూరి బన్నీని తన్నుకుపోయాడు. గౌతమ్ తిన్ననూరి కూడా ఇలాంటి సమస్య చూసిన వారే. `పెద్ది` కంటే ముందే రామ్ చరణ్ కి స్టోరీ చెప్పా డు. సూచన ప్రాయంగా ఒకే చెప్పాడు. కానీ మధ్యలోకి బుచ్చిబాబు దూరి రామ్ చరణ్ డేట్లు లాక్ చేసుకున్నాడు.
ఇలాంటి పరిస్థితులు కూడా హిట్ డైరెక్టర్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇదంతా పక్కనబెడితే? స్టార్ హీరోనే కావాలంటే మంచి సక్సెస్ లున్న దర్శకులు కూడా వాళ్లకోసమే ఎదురు చూస్తున్నారు. టైర్ 2 ..మీడియం రేంజ్ హీరోలకు దిగడం లేదు. చేస్తే సినిమా వాళ్లతోనే చేయాలని పట్టు మీద ఉంటున్నారు. కానీ ఈ క్రమంలో తమ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కోట్ల రూపాల ఆదాయం కూడా కోల్పోతున్నారు. అవే కథలను ఫస్ట్ క్లాస్ హీరోలను పక్కనబెట్టి చేస్తే ఇంకా అద్భుతాలు చేయోచ్చు అన్నది విశ్లేషకుల మాటగా వినిపిస్తుంది. వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి లాంటి వారు తమ స్ట్రాటీని మార్చాలంటూ అభిమానులు కోరుతున్నారు.