యంగ్ బ్యూటీతో పెళ్లైన స్టార్ ప్రేమాయణమా?
బాలీవుడ్ లో మరోసారి ఓ స్టార్ హీరో వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ప్రముఖ హీరో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.;
బాలీవుడ్ లో మరోసారి ఓ స్టార్ హీరో వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ప్రముఖ హీరో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆ వార్తలపై అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినా, నెటిజన్లు మాత్రం ఫుల్ గా డిస్కస్ చేసుకుంటున్నారు.
ఇటీవల ఆ స్టార్ హీరో ఒక యంగ్ హీరోయిన్ తో కలిసి ఓ చిత్రంలో నటించారట. షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా కనిపించిందని సినీ వర్గాల్లో అప్పట్లోనే గుసగుసలు వినిపించాయి. సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ క్లియర్ గా కనిపించిందని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే మొదట రిలేషన్ షిప్ రూమర్స్ మొదలయ్యాయి.
ఇక తాజాగా ఆ వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. ఆ హీరో, హీరోయిన్ మధ్య ఉన్న సంబంధం నిజమేనని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ తరచుగా బయట కలుసుకుంటున్నారని, షూటింగ్ ముగిసిన తర్వాత కూడా వారి కాంటాక్ట్ కొనసాగుతోందని కొందరు చెబుతున్నారు. అయితే ఇవన్నీ కేవలం ప్రచారమేనా, లేక నిజంగానే ఏదైనా సంబంధం ఉందా అనే విషయంపై స్పష్టత మాత్రం లేదు.
మరోవైపు, వివాహేతర సంబంధం అంటూ వస్తున్న వార్తలపై ఆ హీరో లేదా హీరోయిన్ ఎవరూ ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. వారి మౌనం కూడా ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతోందని కొందరు నెటిజన్లు అంటున్నారు. అయితే సినీ పరిశ్రమలో ఇలాంటి రూమర్స్ కొత్తేమీ కావని, సినిమా విడుదల సమయంలో లేదా తర్వాత ఇలాంటి గాసిప్స్ రావడం సహజమేనని మరోవైపు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ప్రస్తుత రోజుల్లో.. ఏ చిన్న విషయం అయినా పెద్ద వార్తగా మారుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు అయితే మరింత వేగంగా వైరల్ అవుతున్నాయి.. చర్చనీయాంశంగా కూడా మారుతున్నాయి. అందులో నిజం ఎంత ఉందన్నది పక్కన పెడితే, ప్రచారం మాత్రం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు, ప్రేక్షకులు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాలని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.
అఫిషియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చే వార్తలను పూర్తిగా నమ్మడం కంటే, వాటి నిజానిజాలు తెలుసుకునే వరకు వేచి చూడటం మంచిదని చెబుతున్నారు. మొత్తానికి స్టార్ హీరో వివాహేతర సంబంధం అంశం ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే, సంబంధిత వ్యక్తులు రెస్పాండ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు కేవలం గాసిప్స్ గానే భావించాలి.