ఎస్ఎస్ఎంబీ29లో మరో బాలీవుడ్ హీరోయిన్?
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.;
ఆర్ఆర్ఆర్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. ప్రతీ సినిమానీ ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసి సినిమా గురించి కీలక వివరాలు, అందులో నటించే తారాగణం గురించి చెప్పే రాజమౌళి ఈ సినిమాను మాత్రం ఎవరికీ ఏమీ చెప్పకుండానే సైలెంట్ గా సెట్స్ పైకి తీసుకెళ్లాడు.
సెట్స్ పైకి తీసుకెళ్లడమే కాకుండా తన గత సినిమాలకు భిన్నంగా ఎంతో వేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు రాజమౌళి. అందులో భాగంగానే ఇప్పటికే ఎస్ఎస్ఎంబీ29కు సంబంధించిన రెండు షెడ్యూళ్ల షూటింగ్ ను పూర్తి చేశాడు జక్కన్న. రాజమౌళి ఈ సినిమాను హాలీవుడ్ లెవెల్ లో తెరకెక్కించనున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమా కోసం హీరోయిన్ గా ప్రియాంక చోప్రాను రంగంలోకి దించాడు.
ప్రియాంక చోప్రా కూడా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనగా ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వినిపిస్తుంది. ఎస్ఎస్ఎంబీ29లో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, ప్రభాస్ తో కలిసి సాహో లో స్క్రీన్ ను షేర్ చేసుకున్న శ్రద్ధా కపూర్ ఇప్పుడు రాజమౌళి మహేష్ తో చేస్తున్న సినిమాలో నటించనుందని సమాచారం.
సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రద్ధా కపూర్ ను తీసుకునే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని తెలుస్తోంది. సినిమాలో శ్రద్ధా పాత్ర కథకు అనుగుణంగా సెకండాఫ్ లో వస్తుందంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియదు కానీ ఒకవేళ ఇది నిజమై శ్రద్ధా కూడా ఈ సినిమాలో భాగమైతే ఈ సినిమా స్థాయి, క్రేజ్ మరింత పెరగడం ఖాయం. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా కథ గురించి కొన్నాళ్ల కిందట రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ మట్లాడుతూ.. తాను, రాజమౌళి దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్ట్ స్మిత్ కు చాలా పెద్ద ఫ్యాన్స్ అని, ఆయన బుక్స్ ఆధారంగానే ఎస్ఎస్ఎంబీ29 స్క్రిప్ట్ ను రాశానని చెప్పారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.