SSMB29 రిలీజ్ డేట్: మళ్లీ ఆ మ్యాజిక్ రిపీటవుతుందా?

సూపర్‌స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-04-09 12:05 GMT

సూపర్‌స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న SSMB29పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ గురించి ఓ ఫ్రేమ్ కూడా బయటకు రాకుండానే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్‌లో ఓ క్రేజీ టాక్ వైరల్ అవుతోంది.. ఇక అసలైన రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందని తెలుస్తోంది.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ ప్రకారం, SSMB29 సినిమాను 2027 మార్చి 25న విడుదల చేయాలని యూనిట్ టార్గెట్ చేసిందట. ఆ రోజు గురువారం కావడమే కాదు, ఆ వారం మార్చి 26వ తేదీకి గుడ్ ఫ్రైడే సెలవు కూడా ఉండడంతో లాంగ్ వీకెండ్ కలిసొచ్చే అవకాశం ఉంది. అదే డేట్‌కు 2022లో విడుదలైన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే డేట్‌ను మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం కూడా బుక్ చేస్తే, మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ మొదలైంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. కథ, లొకేషన్ల ఎంపిక, ఆర్ట్ వర్క్, యాక్షన్ బ్లూప్రింట్ పనుల్లో రాజమౌళి బృందం నిమగ్నమై ఉంది. మహేష్ బాబు కోసం పూర్తిగా కొత్తగా డిజైన్ చేస్తున్న అడ్వెంచర్ సెటప్, గ్లోబల్ బేస్డ్ యాక్షన్ డ్రామా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌గా నిలిపనుంది. ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే, మార్చి 25 తర్వాత ఏప్రిల్ 7న ఉగాది, ఏప్రిల్ 15న శ్రీరామ నవమి వంటి పండుగల వరుసలు రావడం కూడా సినిమాకు కలిసొచ్చే అంశం.

గతంలో బాహుబలి 2.. ఏప్రిల్ లో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు SSMB29 కూడా ఎలాగైనా వేసవి సీజన్‌ను టార్గెట్ చేస్తే, కలెక్షన్ల పరంగా మరో రికార్డు బ్రేక్ చేయడం ఖాయం అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. రాజమౌళి సినిమాల్లో డేట్ ఫిక్స్ కాగానే అఫిషియల్ పోస్టర్లు, టీజర్లు వరుసగా వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు మాత్రం SSMB29 యూనిట్ చాలా స్ట్రాంగ్ ప్రొడక్షన్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది.

విడుదల తేదీకి ఏడాది ముందే వ్యూహరచన చేయడం అనేది బెస్ట్ స్ట్రాటజీ. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో “#GlobalArrivalOnMarch25” అంటూ ట్రెండ్ మొదలుపెట్టే పనిలో ఉన్నారు. ఎస్‌ఎస్‌ఎంబీ29 సినిమా ప్రపంచ ప్రేక్షకులను అలరించేలా ఉందని గతంలో రాజమౌళి చెప్పారు. ఈ డేట్ ఫిక్స్ అయితే, సినిమా వాస్తవంగా హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం.

Tags:    

Similar News